తెలుగు సంవత్సరాది ఉగాది
యుగ యుగాల ఉగాది…
నూతన తెలుగు సంవత్సరాది ఉగాది….
మోసుకొస్తుంది ఆనందాల పునాది….
పంచాంగ శ్రవణాలతో…
రాశి ఫలాల ఫలితాలతో…
నిండైన పర్వదినం ఉగాది!
ఆరు ఋతువులు…
ఆరు రుచులు జీవితాలలో చవి చూపించే పసందైన పండుగ ఉగాది….
తియ్యదనం సంతోషానికి…
చేదు దనం దుఃఖానికి…
కారం కోపానికి…
వగరు శాంతానికి….
ఉప్పు రోషానికి….
పులుపు పొగరుకి ప్రతీకలై…
పెనవేసుకున్న అనుబంధాల తెలుగు పండగే ఉగాది….
వసంతములో ఆకులు చివురించి పువ్వులు పూసి…
శైశవ దశను తెలుపుతుంది..
గ్రీష్మం లో పగలు శేగలు రేపి….
యవ్వన యుక్తులను చూపుతుంది…
వర్ష ఋతువులా జీవితానికి కావాల్సిన శక్తికి సంకేతం ఇస్తుంది…
హేమంతంలా మంచు కురిసే మమతలను నేర్పుతుంది…
శరదృతువు లా చల్లని వెన్నెలలు కురిపిస్తుంది……
శిశిరంలో ఆకులు రాలుస్తూ….
జీవితానికి ముగింపు మరణం అని తెలుపుతూ జీవి జీవిత చక్రాన్ని ఆవిష్కరించే పర్వదినం ఉగాది….
యుగ యుగాల ఉగాది….
నూతన తెలుగు సంవత్సరాది ఉగాది….
– గురువర్ధన్ రెడ్డి