తన కర్తవ్యం
ఇల్లు అనే బండిని కోసం
ఒక తండ్రి తన రెక్కలు ముక్కలతో కష్టం పడుతూ
తన ఇంట్లో వాళ్ళ కోసం
తన ఇష్టాన్ని సైతం త్యాగం చేస్తూ
తన పిల్లలను బాగా చదివించాలని అనుకుంటూ
పిల్లలు తన కష్టాన్ని తెలుసుకొని
ఒక తండ్రిగా తన పేరు నిలబెట్టాలని కోరుకుంటూ
కూతురికి మంచి సంబంధం చూసి
తన స్థాయికి తగ్గట్టుగా పెళ్లి చేసి అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకొని
కొన్ని రోజుల్లో కొడుకు చదువు పూర్తి చేసి
ఒక మంచి ఉద్యోగం రావాలని అనుకున్నా టైంలో
తను తాతయ్య అవ్వబోతున్నాను అని కూతురు నుండి వచ్చిన శుభవార్త విని
ఆ తండ్రి ఆనందానికి అవధులే లేవు…
తొమ్మిది నెలల తర్వాత మనవడు పుట్టి
తన ఇల్లు ఆనందమయం చేస్తారు…
తనకున్న స్థాయిలో బారసాల చేసి
కూతురు , మనవడిని మళ్ళీ అత్తారింటికి పంపించి
ఒకరోజు ఉదయం తన ఆరోగ్యం బాలేక
హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత తన జీవితంలో జీవితపు పోరాటం చేసి
ఒక తండ్రిగా , భర్తగా తన కర్తవ్యం నిర్వహించి
తన కుటుంబాన్ని అర్థాంతరంగా వదిలేసి
ఆ తండ్రి గుండె ఆగిపోయేలా ఆ దేవుడు చేస్తాడు…
– మాధవి కాళ్ల
చాలా చక్కగా వ్రాసారు.