ఫోబియా

ఫోబియా

కావ్య తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఊరు వెళ్ళారు. అక్కడ ఒకే హోటల్ ఉంది. ఆ ఊరికి దగ్గరలో ఏ హోటల్స్ లేకపోవడం వల్ల ఆ హోటల్ లోనే రూమ్ తీసుకున్నారు. ఆ ఊరు చూడడానికి చాలా బాగుంది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు, కొంచం దూరం వెళ్ళిన తర్వాత పొలాల్లో పని చేస్తున్న వాళ్లు కనిపిస్తారు.

అలా ఊరు చూసుకుంటూ ఊరు చివర వరకు వచ్చారు. అక్కడ ఒక భవనం ఉంది. ఆ భవనం చూస్తే ఏదో తెలియని భయం కలిగింది. అసలే కావ్యకి చీకటి అంటే భయం. తన ఫ్రెండ్స్ బలవంతంతో ఈ ఊరొచ్చింది. లేకపోతే కావ్య వచ్చేది కాదు.

“పదంటే… ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాకు చాలా భయంగా ఉంది” కొంచెం భయంగా చెప్పింది కావ్య. “ఏంటే నువ్వు… చీకటి అంటే భయం అన్నావ్, మేము తోడుగా ఉంటాం. కానీ ఈ భవనాన్ని చూస్తే నీకేం భయమేస్తుంది” అని అడిగింది ప్రియాంక. “తన సంగతి తెలిసింది కదా మనకి, చీకటి పడక ముందే హోటల్ కి వెళ్ళిపోదాం” అని చెప్పింది సౌజన్య.

“సరే…” అని చెప్పి హోటల్ కి బయలుదేరారు. హోటల్ కు వచ్చిన తర్వాత హోటల్ ఓనర్, “మేడం… పక్క ఊర్లోనే బుర్రకథ జరుగుతుంది. మేము వెళ్లేసి వస్తాము. మీరు వస్తారా?” అని అడిగాడు శ్రీనివాస్. కాసేపు వాళ్ళల్లో వాళ్ళ మాట్లాడుకొని, “సరే వెళ్దాం…” అని అన్నది కావ్య. “ఎన్ని గంటలకో చెప్పండి, మేము రెడీ ఉంటాం” అని చెప్పింది ప్రియాంక.

“మీరు 7:00 కల్లా రెడీగా ఉంటే, మనం బయలుదేరచ్చు మేడం” అని చెప్పాడు శ్రీనివాస్. “సరే… మాకు కాఫీలు పంపించు” అని చెప్పి వెళ్ళిపోయింది ప్రియాంక. కావ్య ఫ్రెండ్స్ 7:00 కల్లా రెడీ అయ్యి కిందకు వచ్చేసారు. “వెళ్దామా…” అని అడిగింది ప్రియాంక. ఒక్కొక్కళ్ళు ఊరు విషయాలు అడుగుతుంటే శ్రీనివాస్ చెప్తున్నాడు.

అలా మాట్లాడుకొని పక్క ఊర్లో బుర్రకథ చెప్పిన దగ్గరికి వెళ్లిపోయారు. అందరూ తినేసి రావడం వల్ల ఆ బుర్రకి బుర్రకథ వింటూ కావ్య తప్ప అందరూ నిద్రపోయారు. “తన ఫ్రెండ్స్ అందరినీ లేపుతూ పదండే హోటల్ కి వెళ్ళిపోదాం” అని చెప్పింది కావ్య. తన ఫ్రెండ్స్ నిద్ర నుండి లేగకపోవడం వల్ల, ‘తానే ఒంటరిగా హోటల్ కి వెళ్ళాలని అనుకుంది కావ్య.’ 

దారంతా వెళ్తుంటే  చిమ్మ చీకటి కుక్కల అరుపులే వినిపిస్తున్నాయి. మనుషులు ఎవ్వరూ కనిపించడం లేదు. భయం భయంగా వెళుతూ తన వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. కానీ వెనక ఎవ్వరు లేరు. సాయంత్రం చూసిన భవనంలోంచి గజ్జల సౌండ్ వినిపించింది. ఏవో వెనకాల సౌండ్స్ వస్తున్నాయి. చెప్పులు సౌండ్ క్లియర్ గా వినిపిస్తోంది. కావ్య మెల్లగా కళ్ళు ఎత్తి ఆ భవనం వైపు చూసింది.

అంతే మొహం అంతా చెమటలు ఇంకా అటువైపు చేతులు కాళ్లు వణికి పోతున్నాయి. మెల్లగా ముందడుగు వేయబోయింది అంతే భయంకరమైన ఆకారం కనిపించింది. అప్పటికి ఆ భవనాన్ని చూసి భయంతో శ్రీ ఆంజనేయం దండకం చదువుకుంటుంది. ఇంక వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది కావ్య.
బుర్రకథ అయ్యేసరికి తెల్లారి జామున 3:00 అయింది. కావ్యని  ఆ భవనం ముందు చూసి “ఇదేంటి ఇది ఇక్కడ నిద్రపోతుంది” అని అడిగింది ప్రియాంక.

పక్కనుండి సౌజన్య, కీర్తి లు ప్రియాంకకు వాళ్ళ నవ్వు కనిపించకుండా నవ్వుతున్నారు. “అవునే ఏమైంది..?” అని అమాయకంగా అడిగింది కీర్తి. కావ్యని లేపి హోటల్ కి తీసుకొని వెళ్లారు. రూమ్ నుంచి బయటకు వచ్చి  బాగా గట్టిగా నవ్వుతున్నారు సౌజన్య, కీర్తిలు. ఏంటబ్బా నవ్వులు అనుకొని ప్రియాంక వీళ్ళ దగ్గరికి వచ్చి, “ఎందుకు నవ్వుతున్నారు మీరు?” అనుమానంగా అని అడిగింది. “అది… అది… ఏదో జోక్ గుర్తొచ్చి నవ్వుతున్నాం అంతే” అని చెప్పింది కీర్తి.

ఆ భయంతో కావ్యకి జ్వరం వచ్చేసింది. “ఇంకా కావ్య పరిస్థితి చూడలేక సౌజన్య రాత్రి మేమే తనని భయపెట్టాము” అని చెప్పింది. కోపంతో , “మీకేమైనా పిచ్చా… తనుకుంది చీకటి భయం మాత్రమే కాదు  అది ఒక ఫోబియా. వాళ్ళ అమ్మ నాన్నలు మనల్ని నమ్మి పంపించారు. తనకు ఏమైనా అయితే మాత్రం బాధ్యులు మీరే” అని చెప్పింది ప్రియాంక.

“అది కాదు తనకు ఊరికే సరదాగా ఏడిపిద్దామని” కీర్తి చెప్తుండగా, “నోరుముయ్యండి… ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం మీతో స్నేహం చేయను” అది కోపంగా చెప్పింది ప్రియాంక.
“అంత పెద్ద మాటలు ఎందుకులే ప్రియాంక వాళ్లు కూడా మన ఫ్రెండ్స్ ఏ కదా, ఈసారి కి క్షమించి వదిలేయ్” అని కావ్య బెడ్ మీద నుంచి లేస్తూ చెప్పింది. “నీకు నేను తోడుగా ఉంటాను. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను” అని చెప్పింది ప్రియాంక.

మనలో భయం ఇంకా ఎక్కువ అయితే దాన్ని ఫోబియా అంటారు. అది మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. కావ్య లాంటి వాళ్ళని అసలు ఏడిపించకుండా ఉండండి. ఇలాంటి ఫోబియా ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి.

– మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *