తల్లడిల్లుతున్న దేశం
ఆనాడు
భరిస్తే బానిసత్వం
ఎదిరిస్తే స్వాతంత్ర్యమని
బానిస సంకెళ్లు తెంచి
స్వేచ్ఛను తెచ్చి
నల్లోని చేతిలో పెడితే….
నా దేశానికి గంతలు కట్టి
అంగట్లో సరుకులా అమ్మేస్తూ…..
సర్వం దోచు కుంటున్నారు
అభివృద్ధి పేరిట
ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ……
బడాబాబుల జేబులు నింపుతూ……
ఆకాశానికెత్తుతున్నారు
ఒక వైపు డ్రగ్స్, మాదక ద్రవ్యాల మాఫియా….
మరోవైపు రియలెస్టేట్ మాఫియా…….
డబ్బును ఎరజూపి, బెదిరించి
రైతుల భూములు లాక్కుని
పంటభూములనేవి లేకుండా చేసి…..
వ్యవసాయం అంటే ఏంటి అనేట్లు చేస్తున్నారు
ధరలు పెంచుతూ
కార్పోరేట్ సంస్థలకు కాపుగాస్తూ……
ఆదానీ అంబానీలకు గులాం గిరీ చేస్తున్నారు
డొక్కలెండి ఆకలి కేకలు వేసే
పేదవాని రోదనలు…..
అరణ్య రోదనలుగా మిగులు తున్నాయి
యువత మాదక ద్రవ్యాలకు బానిసలై….
సంపాదించినది
తగలేస్తూ…..
ప్రేమించ లేదని అఘాయిత్యాలు చేస్తూ…
బొక్కెడు కూడు పెట్టలేక
కన్న వారిని వీధి పాలు చేస్తూ……
హత్యలూ, దోపిడీలు చేస్తూ….
జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
కులాల పేరిట మతాల పేరిట
స్వార్థ పరులు కల్లోలాలు సృష్టిస్తున్నారు
నా దేశాన్ని ఇన్ని రకాలుగా కుల్లబొడుస్తుంటే…..
ఈ విళయాన్ని చూస్తూ
తట్టుకోలేని నా దేశం
రోదిస్తూ తల్లడిల్లుతోంది
– రహీం పాషా