అనుకోకుండా డాక్టరవ్వబోయి యాక్టరయ్యానని లోకమనెడి మాట లోకువయ్యె బ్రహ్మ రాసినట్లు బతుకులు మారును మనిషి చేతిలోని మహిమ వలన (గాదు) – కోట
Tag: kota
చిత్ర పద్యం
చిత్ర పద్యం ఏడుగడగ తనను ఏలెడి నాథుడు ఎడముకాగ బెదరి ఏడ్పు నాపి ధైర్యమూని.తిరిగి దరిచేరు నాశతో ఎదురు చూచుచుండె ఏలుననుచు – కోట
పాపం పసివాడు
పాపం పసివాడు ఆ.వె 1) అందరాని మిద్దె లాకాశ హర్మ్యాలు ధనిక వర్గమునకు తగిన డాబు ఆకలి కడుపులకు అన్నము లేకున్న పెద్ద మేడ నీడ […]
ఉగాది ఊసులు
ఉగాది ఊసులు 1 ఆ.వె ఉప్పు.తీపి.కారముపకారమును చేయు చేదు.వగరు.పులుపు చేయు మేలు ఏవి యెక్కువైన ఇక్కట్లు వచ్చును మితము ఎప్పుడైన హితము గూర్చు 2 తే.గీ. కలిమి లేములు సంతోష […]
నాలో నేను
నాలో నేను 1) వృద్ధ గురువులంత ఒకచోట చేరగా పాత జ్ఞాపకాలు పరిమళించె అయ్యవారలంత ఆయురారోగ్యాల సాగవలయు శాంతి సౌఖ్యములతొ 2) ఉగ్రవాదమింత ఉగ్రరూపము దాల్చి […]
ఎదురు చూపులు
ఎదురు చూపులు 1)ఉన్నత చదువులకు ఉద్యోగమొచ్చునని బాధలు పడి చదివి భంగపడిరి ఏడువత్సరాలు ఎదురు చూపులెగాని కోర్కె తీరదాయె కొలువు రాక 2) చూపు కన్న ఎదురు చూపులు కష్టమౌ బంధు జనమును కన […]
మన్యం వీరులు – అల్లూరి, కొమరం
మన్యం వీరులు – అల్లూరి, కొమరం 1)మన్యవీరులందు మాతృదేశముపైన పరులపాలనింక పారనీక పెత్తనమును పూర్తి పెరికి వేయగ బూని అమ్ము చేతబట్టి అమరుడయ్యె 2)కొదమ సింగమాయె కొమరం భీముడు మన్య జనుల హక్కు మరచిపోక […]
అజ్ఞాతం
అజ్ఞాతం అడవులందు గడిపిరగ్నాత వాసులై విరటు గొల్చిమారు వేశములతొ గొప్ప చెప్పుకోక గోప్యము గుండుట పాండు నందనులకు పాడియయ్యె – కోట
ఆశ
ఆశ ఆశవల్ల నరుడు అవమానములు పొందు ఆశవల్లనరుడు అంతరించు ఆశ వదలువాడు అవనిలో దేవుడౌ కోట వారిమాట కోటిమూట – కోట
చెరువు -కల్పతరువు
చెరువు -కల్పతరువు మా ఊరి చెరువు -తలతల మెరయు మా బ్రతుకు తెరువు -ఈ కల్పతరువు మా చెరువు. నిండితే… సాగు భూములకు -తాగు జీవులకు జలచరాలకు -జగతి ప్రాణులకు పాడి పంటలకు -పళ్ళతోటలకు […]