సువర్ణ భూమి
అందమైన లోకం
అందులో నువ్వొక అద్భుతం
జనియించే జీవశక్తి
నడయాడేను నవశక్తి
ఉషోదయం కాంతులు
సంద్యవెలుగు వెలుగు సవ్వడులు
సిరివెన్నెల రాత్రులు
సింగారపు సంపదలు
వర్షించే మేఘాలు
హర్షించే భూమాత
కమ్మనైన ఫలాలు
ఇంద్రధనుస్సు వర్ణాలు
నడయాడే నదీ నదాలు
పలకరించే పైరగాలులు
ఆరగించు షడ్రుచులు
ఆహా అనిపించు
చూసుకో సువర్ణ భూమి
ఆత్మానందం నీ కోసం
ఇదేకదా అందమైన
లోకంలో నీ ప్రతిబింబం.
– జి.జయ