స్త్రీ – శక్తి స్వరూపిణి
స్త్రీ సృష్టికి మూలం
స్త్రీ శక్తి అపారం
స్త్రీ ప్రేమ అమోఘం
స్త్రీ కోపం అవాంఛనీయం
నిరంతర ఆరాధనీయం స్త్రీ తత్వం
సదా ప్రేమానురాగాల వ్యక్తిత్వం
వెల లేనిది ఆమె ఔన్నత్యం
ప్రేమకు ప్రతిరూపం
త్యాగానికి నిదర్శనం
ఓర్పుకు చిరునామా
ఓదార్పుకు మారుపేరు
స్త్రీ తలచుకుంటే విలయతాండవం
స్త్రీని గెలుచుకుంటే ప్రణయతాండవం
అదే స్త్రీని వదులుకుంటే నిరంతర గండం
ప్రేమతో ఎవరినైనా గెలవ గలిగిన నారీమణి
సకల జ్ఞానాలకు మూలమైన వాణి
దైవాలను సైతం గెలిచిన తరుణి
వసుదైక కుటుంబాలకు మూలమైన గృహిణి
కదనరంగాన కాలు దువ్విన వీరవనితలు
రాజకీయాలలో చక్రం తిప్పిన మూలస్తంభాలు
కళారంగా నా కీర్తికెక్కిన తారాజువ్వలు
క్రీడారంగంలో కదం తొక్కిన జగజ్జేతలు.
విద్యావనంలో విరబూసిన కుసుమాలు
స్త్రీలు సమాజానికి వెలుగు రేఖలు
స్త్రీలు చరిత పుటలలో నిలచిన చిరంజీవులు..
– కిరీటి పుత్ర రామకూరి