స్ఫూర్తిగీతం

స్ఫూర్తిగీతం

 

*పల్లవి*
నిరాశ నిండిన కళ్ళలో
ఆశల వెలుగే పండగ
బతుకే కాదా పండగ
ఆనందాలిక పండుగా

*చరణం*
కలతలు నిన్ను నిలదీస్తే
కలలే నిన్ను సరిజేయు
ఒంటరి భావన వదిలేసి
అందరితోనూ ఒకటవ్వు
రేపటి ఆశను వెతికేవాడా
నేటి జీవితం మరువకుమా
గతమెంతో ఘనకీర్తే
బందీగా నువు మారకుమా

*చరణం*
బతుకంటే పోరాటం
కావాలోయ్ ఆరాటం
స్ఫూర్తిని పంచి స్ఫూర్తిని నింపి
వేయాలోయ్ ముందడుగు
పగలూ రేయి కష్టించే
శ్రమజీవులనే చూసితివా
రేపటి చింతే లేనివారితో
పాదము కలిపి కదలాలోయ్

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *