ప్రేమ జల్లు
అంబర సంబరం నేలకు ఎంతో ఆనందం
ఎర్రని కాంతులు ఏరిగిన వాళ్ళకి
మనసున కరిగెను ఎంతో ఉల్లాసం..
ప్రకృతి ఆనందం పరవశ మాయ
నా వశమే హాయిగా మారే..
మేఘాల రాగాలు ఆగమేఘాల మీద
వర్షాధార నేలపైన పార..
నా మనసులో రాగాల మాలిక నన్ను
తీగల అల్లుకొని తియ్యని ముల్లులా గుచ్చుకున్నది
ప్రేమ జల్లుల అంటుకున్నది..
– పలుకూరి