స్నేహం
పది కాలాలు పదిలంగా నిలిచేది,స్నేహం.
నవమాసాలు అమ్మ కడుపును
పంచుకోకపాయినా,
నూరేళ్ళు పంచుకునేది, స్నేహం.
అష్టకష్టాలు వచ్చినప్పుడు,
అండగా నిలిచేది, ఆదరించేది,స్నేహం.
సప్తసముద్రాలు దాటి వెళ్ళినా, తెంచుకోలేనిది ,స్నేహం.
ఆరడగుల గోతిలో చేరేవరకు నిలిచేది,స్నేహం.
పంచభక్ష్య పరమాన్నాలు వున్నా,లేకున్నా!
కలుపుకుపోయేది,స్నేహం.
నలుగురిలో తోడుందేది,స్నేహం.
ముక్కంటికి మరో రూపం, స్నేహం
రెండు వేరు వేరు వర్ణనాలను, వర్గాలను
మనసులతో జత చేసేది ,స్నేహం.
అభిప్రాయాలు,ఆలోచనలు వేరైనా,
ఒక్కటిగా జీవించమనేది, జీవించేది, స్నేహం.
-బి రాధిక