స్నేహము !

స్నేహము !

అరుణ ఒక అందమైన అమ్మాయి అందము అంటే మరీ అందమైంది కాదు ఏదో కాస్త మామూలుగానే ఉంటుంది. ఒక స్కూల్లో టీచర్గా పని చేస్తోంది ఆమెకు ఒక ఫ్రెండు ఉండేది ఇద్దరూ ఒకే దగ్గర అంటే అరుణ ఫ్రెండ్ ఎక్కడికైనా వెళ్లాలంటే అరుణ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి.

కాబట్టి ఇద్దరు కలిసి రోజూ స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉంటారు. అరుణది ఒక చిన్న ఇల్లు ఉన్నా సొంత ఇల్లు అది. అందులో ఆమె వాళ్ళ తల్లి ఇద్దరూ ఉంటారు. తల్లి పేరు శ్యామల ఏదో బీద పరిస్థితుల్లో ఉన్నారు వారికి ఎక్కువగా ధనం లేదు.

అక్క చెల్లెలు గానీ, అన్న తమ్ముళ్లు కానీ ఎవరూ లేరు తనొక్కతే. ఎవరూ లేరు చాలా రోజులకు ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇంటిపని చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి, స్కూల్ కి వెళ్ళాలి, రావాలి. ఇంట్లో తల్లి ఏదో చిన్నచిన్న పనులు తప్ప ఇంక వేరే పెద్దపెద్ద పనులు చేయలేని పరిస్థితిలో ఉంది.

కానీ చిన్నగా కూర్చున్న దగ్గర వంట చేసి అమ్మాయికి టిఫిన్ కట్టేది. అరుణ పొద్దున స్కూల్ కి వెళ్తే సాయంత్రం వరకు వచ్చేది కాదు ఇంట్లో ఉన్న అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ, ఎండి న బట్టలను తీసుకుని వచ్చి మెల్లగా మడత పెట్టి పక్కన పెట్టేది. స్టవ్ మీద కాఫీ పెట్టుకొని, తను తాగి అమ్మాయికి ఫ్లాస్క్ లో పోసి ఉంచేది.

ఏదో చిన్నచిన్న పనులు చేతనైనంత వరకు చేసేది. అరుణ నాలుగున్నరకు స్కూల్ వదలగానే సుధా, అరుణ ఇద్దరూ వచ్చేవారు. అరుణ వాళ్ళ ఇంటి ముందు నుంచి సుధా వెళ్లాలి తన ఇంటికి.

ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత తనకు వచ్చే జీతం చాలక ఇంట్లో గడవక చాలా ఇబ్బందిగా గడుస్తున్న రోజులు చాలి చాలని జీతంతో తల్లికి మందులు కొనడానికి ఇబ్బందిగా ఉండేది అని ఆలోచిస్తున్న టైంలో తనకు ఒక ఉపాయం తట్టింది.

స్కూల్ పిల్లలకు ఒక పది మందిని పోగేసి ట్యూషన్ చెప్పాలని ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే అమలు చేసింది. హెడ్మాస్టర్ ని అడిగి, ఒక పది మంది పిల్లలను నా ఇంటికి పంపించండి. నేను వాళ్లకు ట్యూషన్ చెప్తాను అని పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడింది.

ఎలాగో పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాను కదా ఆ డబ్బుతో నెలకు సరిపడా సరుకులు తెచ్చుకోవచ్చు అని, తల్లికి మందులు కూడా తీసుకు రావచ్చు అని ఆశపడింది.

ఆ ఆలోచనతో అరుణ మనసు తేలిక పడింది. తల్లి కూడా సంతోషించింది. ట్యూషన్స్ చెప్తూ వచ్చిన డబ్బుతో అన్ని విధాల తల్లికి మందులు ఇవ్వడం తల్లి కావాల్సినవి తెచ్చి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండేది ఇలా కొద్దిరోజులు గడిచాయి.

ఒకరోజు అనుకోకుండా సుధా ఫోన్ చేసి, ఇప్పుడు వచ్చే ఆదివారం నాకు పెళ్లిచూపులట ఇందాకే మా అమ్మ చెప్పింది నువ్వు తప్పకుండా రావాలి ఏ పనీ పెట్టుకోకు వస్తావు కదూ అంటూ ఫోన్ చేసి తప్పకుండా రావాలి మరి నువ్వు వస్తేనే నేను పెళ్లి చూపులకు కూర్చుంటాను అని అంది సుధా… సరే తప్పకుండా వస్తాను అంది అరుణ. ఇంతలో సుధా ఫోన్ కట్ చేసింది.

సాయంత్రం ఆరు అవుతుంటే పిల్లలు ట్యూషన్ కి వచ్చారు. వరండాలో పిల్లలందర్నీ కూర్చుండబెట్టుకొని తను కూర్చుని పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆరు నుండి ఎనిమిది గంటల వరకు పిల్లలకు ట్యూషన్ చెప్పింది. ఎనిమిది గంటలకి పిల్లలందరూ ఇంటిని వెళ్ళిపోయారు.

పిల్లలు అందరూ కూడా అరుణ ఉన్న చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉండేవారు. తెల్లవారితే ఆదివారం ఈరోజే కదా సుధా పెళ్లిచూపులు పిల్లలేమో ట్యూషన్ కి వస్తారు, వాళ్ళను వదిలి ఎలా వెళ్ళేది? ఎంతసేపు పిల్లలు ఉంటారు అని ఆలోచించింది.

ఆ మాటలు విన్న తల్లి నేను కూర్చుంటాను కదమ్మా నువ్వు వచ్చేవరకు నువ్వు వెళ్లి రా పాపం వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారు తప్పకుండా వెళ్ళు నేను ఎలాగోలా ఇక్కడ పిల్లల దగ్గర కూర్చుంటారు తల్లి ఇచ్చిన సమాధానం విని సంతోషపడింది అరుణ.

ఆదివారం రానే వచ్చింది. తను తయారవుతున్న వేళలో ఎవరో ఒకతను ఒక అమ్మాయి ని తీసుకొని వచ్చాడు.

“ఏమండీ ఇంట్లో ఎవరు” అని అడిగాడు.

“ఎవరు కావాలి మీకు” అంటూ అడిగింది అరుణ.

“మా అన్నగారి అమ్మాయి అండి మీరు ట్యూషన్ బాగా చెప్తారని అమ్మాయిని ట్యూషన్ కి పంపించడానికి వచ్చాను” అంటూ జవాబిచ్చాడు.

అతన్ని చూస్తూనే, “మీకు ఎవరు చెప్పారు నేను ట్యూషన్ బాగా చెప్తా అని” అడిగింది.

“నేను స్కూల్ కి వెళితే అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు మీ పేరు అరుణ కదండీ?”

“అవునండి నా పేరు అరుణ, నేను ఏదో బతుకుదెరువు కోసం పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాను ఎలాగూ వచ్చారు కదా అమ్మాయిని ఇక్కడే వదిలి వెళ్ళండి మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా నేను మీరు మీ అమ్మాయికి ఏమవుతారు? అని అడిగింది.

“నేను బాబాయిని అవుతాను, పేరు కిరణ్ హైదరాబాదులో ఉంటాను సాఫ్ట్వేర్ జాబ్ నాది నేను ఎప్పుడో కాని ఇక్కడికి రాను. సెలవులు ఉంటే వస్తాను అయినా బయట తిరగను ఎప్పుడూ స్కూలుకు రాలేదు అందుకే మీరు నన్ను చూడలేదు” అన్నాడు.

“అయ్యో ఈ రోజు ఆదివారం కదండీ నేను మా ఫ్రెండు పెళ్లి చూపులకు వెళ్లాలి, పిల్లల్ని అందరిని ఇలాగే కూర్చోబెట్టి వెళ్తే మా అమ్మ చూసుకుంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు ఎలా ఉంటుందో ఏమో!? పిల్లలు బుద్ధిగా కూర్చుని చదువుకుంటారు అనుకుంటున్నాను”. 

ఇంతలో అతను, “మీరు వచ్చే వరకు నేను ఉంటాను లెండి నాకు ఏమీ పని లేదు కాబట్టి మీరు వెళ్లి రండి”.

“ఎంత టైం పడుతుందో తెలియదు కదా, ఎలా అంతసేపు ఉంటారు మీరు” అడిగింది.

“పర్వాలేదండి ఉంటాను మీరు వచ్చే వరకు ఉంటాను ప్రామిస్ అండి ఉంటానని చెప్తున్నాను కదా మీరు వెళ్ళండి.”

“మధ్యాహ్నం భోజనం ఎలా మరి మీకు” అని అడుగుతుంటే అమ్మ లోనికి పిలిచింది. అతడికి ఇంత అన్నం పెడతానులే నువ్వు వెళ్లి రా తల్లి తొందరగా వచ్చేయ్. పిల్లలందరూ ఎలాగు బాక్సులు తెచ్చుకుంటారు కదా అప్పుడే నువ్వు అతడికి కూడా అన్నం పెట్టు అని చెప్పింది అరుణ.

అరుణ రెడీ అయి చెప్పులేసుకుని వెళుతూ, “థాంక్స్ అండి నేను వచ్చే వరకు ఉంటారు కదా” అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది అరుణ ఉన్న ఇంటి ముందు వాడ లో సుధా వాళ్ళ ఇల్లు ఉంటుంది. దానికంటే ముందు లో ఉన్న సుధ వాళ్ళ ఇంటికి బయలుదేరింది.

పదినిమిషాలు నడిచిన తర్వాత సుధా వాళ్ళ ఇల్లు వచ్చింది. ఇంటి ముందు కొంచెం సందడి సందడిగా ఉంది ఇంటి పక్కన ఉన్న అమ్మాయిలు అందరూ చేరారు. నన్ను చూడగానే వచ్చావా అరుణ నీ కోసమే వెయిటింగ్ నేను ఇంకా రెడీ అవ్వలేదు నువ్వు వస్తే కానీ నేను రెడీ అవ్వను అని కూర్చున్నాను అని మాట్లాడింది సుధ.

వాళ్ళ అమ్మ ఎదురు వచ్చి నువ్వు వచ్చేవరకు తయారుకానని కూర్చుంది. పిల్లవాడు వచ్చే టైం అయింది ఇంకా ఇది రెడీ అవ్వట్లేదు నువ్వే చెప్పు అంది తల్లి.

అలాగే ఉన్నావా నువ్వు ఎప్పుడో రెడీ అయ్యావు అనుకున్నాను ఈ పాటికే అబ్బాయి వాళ్ళు వచ్చారు అనుకున్నాను అంటూ సుధ గదిలోకి వెళ్ళి కూర్చుంది అరుణ. నేను ఎలా తయారవుతాను అనుకున్నావు నువ్వు వస్తేనే కానీ నేను రెడీ అవ్వనని నేను ముందే చెప్పాను నీకు.

అయినా నువ్వు లేటుగా వచ్చావు నేను అలిగాను నువ్వు ఇంత లేటుగా వస్తావా? అది కాదే నేను వచ్చే ముందు ఒక అమ్మాయిని తీసుకుని ఒకతను వచ్చాడు.

వాళ్ళ అమ్మాయికి ట్యూషన్ చెప్పమని వచ్చాడు అతనితో మాట్లాడి పిల్లలందరినీ సైలెంట్ గా ఉండమని చెప్పి బుద్దిగా చదువుకో అని చెప్పి వచ్చేవరకు లేట్ అయింది సారీ….

సరే.

సరే అయితే నువ్వు తయారు అయ్యి చీర కట్టుకో, పూలు పెట్టుకో, రెడీగా ఉండు వాళ్లు వచ్చే టైం అయింది. వాళ్ళు రాగానే వాళ్ళకి టిఫిన్లు, కాఫీలు ఇవ్వడానికి ముందు నువ్వే వెళ్ళాలి ఎందుకంటే మేమంతా నీ వయసు వాళ్ళమే కదా నీ వెనకే వస్తే బాగుండదు నువ్వే వెళ్లాలి అంది అరుణ.

లేదు లేదు నువ్వు ఉండాలి నా పక్కన లేకపోతే నేను పెళ్లి చూపులకు కూర్చొను అంది సుధ. సర్లే తల్లి ముందు చీర కట్టుకొని రెడీగా ఉండు… అలా మాట్లాడుతూ ఉండగానే బయట కారు చప్పుడు వినిపించింది.

వాళ్లు లోపలికి కూడా వచ్చేశారు నీదే ఆలస్యం తొందరగా కానీ అంటూ అంది. అరుణ చీరలో చాలా అందంగా ఉన్నావు ఎలాగైనా పిల్లడు నచ్చుతాడు. సర్లే వెళ్ళు, కాఫీ తీసుకు వెళ్ళు ఇంతలో తల్లి వచ్చి కాఫీ కప్పులు ట్రెలో తీసుకొని వచ్చింది.

కాఫీ ట్రైని పట్టుకొని హాల్ లోకి వెళ్ళింది సుధ అక్కడ నలుగురు ఉన్నారు తలవంచుకొని అందరికీ కాఫీలు అందిచగానే తల్లి పిలిచి, రావమ్మా ఇక్కడ కూర్చో అని చాప వైపు చూపించింది.

కాఫీ లు తర్వాత మీతో మాట్లాడవచ్చా అంటూ అడిగాడు అబ్బాయి మీతో మాట్లాడవచ్చా అని అడిగిన మాటలకు ఏం మాట్లాడుతారు కట్నాలు కావాలనా బంగారం కావాలనా ఇంకా ఏమైనా కావాలి అని అడుగుతారా అంది సుధా.

సుధ ఎందుకు ఇలా మాట్లాడింది? ఇలా మాట్లాడినందుకు పిల్లవాడు హార్ట్ అయ్యాడా? పెళ్లి చూపులు క్యాన్సల్ అయ్యిందా? తెలుసుకోవాలంటే తదుపరి భాగం వరకు ఆగాల్సిందే…. 

– శారదా దేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *