సృష్టి
నా అందమైన శత్రువు ఈ ప్రపంచం ఎందుకంటే..
ఈ సృష్టి ని ఆస్వాదించే ప్రతి క్షణం, మనసుకి ఎంతో హాయి అద్భుతమైన ఆనంద భావనా… ఇక్కడ ఎన్నో వేల కోట్ల జీవరాశులు అందులో ప్రత్యేకమైన వారే ఈ “మనుషులు”… గజిబిజి గందర గోళ ప్రపంచం లో ప్రతి మనిషి జననం మరియు నడవడిక మన తల్లితండ్రుల నుండి కొంత నేర్పిన పూర్తిగా బయట ప్రపంచం నుండి నేర్చుకోవాలి….
ఎంతో మంది ఊహా తెలిసినప్పటికీ నుండి వచ్చే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు ఎందరో… వారి నుండి నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకు సాగాలి ఈ అందమైన ప్రపంచం ఒక్కో సమయంలో మంచిగా మనతోనే ఉన్నట్లుగా, ఒక్కో సమయంలో బద్ద శత్రువై కనిపిస్తుంది…. ఇక్కడ మంచి, చెడు, కష్టం, సుఖం దుఃఖం సంతోషం ఆనందం బాధ బాధ్యత, ఓపిక సహనం పట్టుదల, సాధన, సంపాదన, ఎత్తులు, పై ఎత్తుల చదరంగం, అన్నీ రుచి చూపిస్తుంది.
మనమేంటి మన మార్గం ఏంటి అనేది విధి విసిరే సవాళ్లు కాలం వేసే శిక్షలు, అనుకూల ప్రతికూల పరిస్థితులు, ఎన్నో అనుభవాలు అనుభూతులు అన్నీ పరిచయం చేసేది ఈ “అందమైన ప్రపంచం నా అందమైన శత్రువు” ఇక్కడ ఆలోచనలతో పోటీ పడాలి ఉన్నతమైనవిగా, జననం నుండి మరణం వరకు చివరి వరకు చితి వరకు ఈ ప్రపంచంలో మనకు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తుంది… మరణం తర్వాత కూడా జీవించేలా మనం పదిమందిలో బతకాలంటే మన జీవితం గొప్పగా ఉంటే ప్రపంచం అనే చరిత్ర పుటల్లో చిరకాలం శాశ్వతం…..
– సీతా మహాలక్ష్మి