శరత్ జ్యోత్స్న
వినీలాకాశాన పిండారబోసినట్లు
శ్వేత వర్ణమేదో గగనాన ఒలికి పారినట్లు
వినీలాకాశాన రాశిగా మిణుగురులన్నీ చేరినట్లు
నీ చల్లని దరహాసాన నిండిన స్వచ్ఛతలా…
వీచే పవనాలు మోసే నీ మేని గుభాళింపులా…
తలలో మురిసి మెరిసే మత్తెక్కించు మల్లెల్లా…
పసిపాప బోసితనపు చిరునగవులా…
అమ్మ ప్రేమలోని కమ్మదనపు అమృతంలా…
ననువీడిపోలేని నీ మనసున దాగిన శరత్ చంద్రికలుగా
ఒకరికొకరమని చాటిన కాలమే సాక్ష్యంగా….
ఎన్నటికీ విడివడని బంధమే మనదిగా….
ఆ నీలి గగనాన పున్నమి రేతిరి రేరాజు ప్రకాశించే శరత్ జ్యోత్స్నలా….
ప్రకాసించిపోదాము
అనురాగ సీమలో అలకల లోగిలిలో….
మమతలెరిగిన మంచి బంధముగా…
– ఉమామహేశ్వరి యాళ్ళ