సప్త వర్ణాలు
సీతాకోక చిలుక వలె
తెలుగు రుచి సప్త వర్ణాల
శోభితం .
ఒక తెల్లని రంగే ఏడు
వర్ణాల హరివిల్లు
ఆకాశానికి అచ్చేరువేస్తే
సప్తవర్ణాలు సందడి చేస్తాయి
కవిభావం ఉప్పొంగితే
కలం సప్త వర్ణాలు గిరి గీస్తుంది
కళాకారుడి మనసు అద్దమైతే సప్త వర్ణాల చిత్రమవుతుంది
కళాకారుడు గొంతు విప్పితే
సప్తస్వరాలు సరిగమ లవుతాయి
పోగు పోగునా రంగు లద్దితే
వన్నె లొలికే వస్త్ర మవుతుంది
మగువ మమకారంతో
ఇల్లు ఆనంద హోలీ అవుతుంది ….
– జి జయ