ఆత్మాభిమానం
*మన దగ్గర ఉన్న వాటితో సరిపెట్టుకుంటే ప్రతి చోటూ స్వర్గమే.*
*లేనిదాని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగూ నరకమే.*
*ఒక్కోసారి మన నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మనల్ని గెలిపించలేన్నప్పుడు… ఓర్పు, సహనం మాత్రమే మనల్ని గెలిపించగలవు.*
*మనం చేసిన మంచి పనిని అందరూ స్వీకరించకపోయినా, అవసరము, అర్హత ఉన్నవాళ్లు స్వీకరిస్తారు.*
*మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది.*
*మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం. అది ఎపుడూ అంత ఎత్తులో ఉండాలి. ఒకరు చులకన చేసారు అని ఎప్పుడు అనుకోకూడదు. ఎవరి స్థాయి వారిదే.*……
– రాంబంటు