సంకల్ప బలం
తడబడుతు తలబడుతు సాగిపో
శిఖరం ఏదైన అధిరోహించు
నీ బలంతో సంకల్ప బలంతో
భారం ఎంతైన బాధ్యత నీదేగా
ఎత్తు పైకెత్తు ఆకాశాన్నే ఢీకొట్టు
నీ బలంతో సంకల్ప బలంతో
భయమే నిన్ను వెనుకకు నెట్టినా
బాణంలా దూసుకుపోరా
నీ బలంతో సంకల్ప బలంతో
అటుగా ఇటుగా ఎటువైపైన
ముందరికాళ్ళ బంధాన్ని
అనుబంధంగా మార్చేయరా
నీ బలంతో సంకల్ప బలంతో
వేసే అడుగు చేసే పని
చెప్పే నోట వినే మాట
నీ గమ్యానికి చేరవేయరా
నీ బలంతో సంకల్ప బలంతో
– సతీష్ కొయ్యల