సమీక్ష వ్రాసేవారికి మనవి

సమీక్ష వ్రాసేవారికి మనవి

ఒక కధ కానీ, కవిత కానీ వ్రాయాలంటే చాలా మేధస్సు ఉపయోగించాలి. రచనలుచేయటం అంత సులభం కాదు.

వాస్తవ కధలు వ్రాయాలన్నా కూడా ముందు ఎంతో కొంతసమాచారం సేకరించాలి.కాల్పనిక కధలు, సైన్స్ ఫిక్షన్కధలు, ప్రేమ కధలు ఇలా ఏకధ వ్రాయాలన్నా రచయితలకు కల్పనా శక్తి ఉండాలి.

కవితను పాఠకుల మనసుకు హత్తుకునే విధంగా వ్రాయాలని ప్రతి కవి మనసులోఉంటుంది. కవులు సృజనాత్మకకవితలను పాఠకుల కోసమే కాగితంపైన ఆవిష్కరిస్తారు.పాఠకుల ప్రశంసలే కవులకుప్రోత్సాహం అందిస్తాయి.

సమీక్ష చేసే వారు రచయితల రచనలను పూర్తిగా చదవి సద్విమర్శ చేయాలి. అలాకాకుండా ఏదో రివ్యూ వ్రాయాలికాబట్టి రచయితల రచనలను విమర్శించుకుంటూ పోతేఆ రచయిత మనసు నొచ్చుకుంటుంది.

సద్విమర్శఅంటే ప్రతి రచయితకూ ఇష్టమే. దాని వల్ల కొత్తవిషయాలు నేర్చుకునేఅవకాశం రచయితలకువస్తుంది.

అంతే కానీరచన పూర్తిగా చదవకుండాఏదో ఒక రివ్యూ వ్రాసేసేవారే ఎక్కువ మంది ఉన్నారు.రివ్యూ వ్రాయటం కూడా ఒకకళ.

మొన్నటి వరకు మాధవిగారు చక్కటి రివ్యూస్అందించారు. మంచి రివ్యూస్వల్ల రచయితలకు ఉత్సాహం వస్తుంది. మరిన్ని మంచి రచనలు చేస్తారు.

కువిమర్శలురచయిత రచనా శక్తిని చాలాదెబ్బతీస్తాయి. రచయితసహజంగా చాలా సున్నిత మనస్కుడు అయి ఉంటాడు.సద్విమర్శలు రచయితలకు మేలు చేస్తాయి. కువిమర్శలు రచయితకు కీడు చేస్తాయి.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *