గాయాన్ని పొడిచేతువా

గాయాన్ని పొడిచేతువా

పల్లవి :—–

గుడిలోని జంగమయ్య గుర్తెరుగవా
నిన్నెరుగలేదనే నెపానికి నా గుండెకు
గాయాన్ని పొడిచేతువా….

చరణం :——

బతుకంత చీకటిని బరువుగా మోసినా
తెగని బంధాలతో తెలవారలేదని…
చిగురంత దీపమై కొండంత తిమిరాన్ని
జరుపుతు…తలచినా వాడి జీవితాన
భోధి వృక్షమై నిలిచేతువా….

చరణం :—–

మరిచినా తుమ్మెదలకు మంకెనవై
కనబడుతు…తూర్పార బోసినా
వెలుగును నీ అరచేతులపై నడుపుతు…
కొమ్మ కొమ్మన కోటి లతల ప్రాకారాలలో
నిండిన దినమంతటి మకరంధాన్ని
దాచేతువా….

చరణం :—-

కర్మచేసిన మనుషులుగా బతుకెంతో
చిన్నదని…దోసిటా దొరకిన కష్టాన్ని
నమ్ముకొని… పిలుపు కానీ బతుకున
బంధాలు పెంచుకొంటు…దయవుంచినా
ప్రేమతో కరుణించినా రూపమై…
దినమెల్లనీ బతుకులకు దిక్సూచి వై
కనిపింతువా…

చరణం :—–

అడగనీ వారందరి చిలికినా ఫలితాన్ని
కంఠాన గరళంగ దాచావు…
దోయబడని సిరిగా తలపైన గంగమ్మను
కోరినంతనే నేలకు పంపావు…
ఏడేడు లోకాలను కలిపేటి ఏకమైన
రూపంగా వేడుకవై నడిచొత్తువా…

 

-దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *