సమాజంలో మగాడి పాత్ర
ఈ అర్థంలేని సమాజంలో ఏ సమస్యా నన్ను చుట్టుముట్టకుండా నా వెనుక ఉండి ముందుకి నడిపించిన నాన్నగా…
నా భవిష్యత్తును ఆనంద సంతోషాల నడుమ నాకోసం పరితపించే నా సర్వస్వంగా నిలిచిన బాధ్యత గల భర్తగా…
నా తోడు నీడవై నాకు ధైర్యం చేకూర్చిన అన్నగా…
కష్టాల కన్నీరు మధ్య నలిగిపోయే నాకు ఓదార్పుని అందించే స్నేహితుడిగా…
మా ఈ జీవితంలో ప్రతి అడుగులో మాకు తోడుగా నిలిచి మమ్మల్ని కాపాడుకుంటూ మాకై కృషి చేసే మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం…
– సుచిత్ర