సమాజం
సమాజం నిన్ను ప్రతిసారి భయపెట్టాలని చూస్తుంది
ముందుకు వెళ్తానంటే వెనక్కి రమ్మని పిలుస్తుంది
కాస్త పేరు వస్తే నిందలెన్నో వేస్తుంది, నిష్టురాలు ఆడుతుంది
పేరు రాగానే మర్చిపోయావు, మారిపోయావు అంటూ
నిన్ను, చిన్నచూపు చూస్తుంది.
అదే సమాజం నువ్వు కాస్త పేరు గడించకపోయినా,
ఏమీ చేత కానివాడివంటూ వేలెత్తి చూపుతుంది.
నికెన్ని అవకాశాలు ఇచ్చినా అందుకోలేదు అంటూ
పరాయి వాడిలా వెలి వేస్తుంది.
పేరు గడించారు అని తెలియగానే మా వాడు అంటే మా వాడు అంటూ మునగ చెట్టు ఎక్కిస్తూ ముందుకు వస్తారు
నేనే ఆ రోజు నీకు సాయం చేసానంటూ నీ నెత్తి మీద
కూర్చుని తాండవం చేస్తారు.
అదే సమాజం నువ్వు గొప్పవాడివి అయితే మమల్ని
పట్టించుకోలేదు అంటూ నిన్ను అణచి వేస్తుంది.
ఇదే సమాజం తీరు…
– భవ్య చారు