సమాజం
ఆ నడి రోడ్డుపై అతని పక్కన నడుచుకుంటూ ,
ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది.
అంతే…..!
అతని స్నేహితులు
కేకలేసి రంకెలేస్తున్నారు.
ఆ సమాజం వాళ్ళని చూసి
చెవులు కొరుక్కుంటుంది.
ఆ పండు ముసలామె బుర్రలో
అనుమానం పుట్టలు కట్టేసింది.
ఆ పద్దెనిమిదేళ్ల కుర్రాడు ,
వాళ్లకి చిలుక, కాకి అని పేర్లు పెట్టేశాడు.
ఆ ఆలుమగలు
సభ్యత , సంస్కారం గుర్చి
ఒకరినొకరు బోధించుకుంటున్నారు…..!
అక్కడ అందరి కళ్ళు వాళ్ళ వైపే….,
ఆ కళ్ళపై అనుమానమనే కరిమబ్బు కమ్మేసింది
ఆ మబ్బునుండి
ఎర్రటి పదునైన మాటల వర్షం కురిసింది
ఆ వర్షపు నీటిని
ఒకరినొకరు పంచుకుంటూ ,
కుటిల దాహాన్ని తీర్చుకుంటున్నారు….!
– క్రేజీ కామేష్