సాయిచరితము

సాయిచరితము

పల్లవి
నీ చూపు మేము వెతికేము సాయి
మాలోన మలినాలను తీసేయి సాయి
నడిపించు గురువు నీవేను సాయి
నిను తలచుతూ మేము సాగేము సాయి

చరణం
నీ పేరు తోడై మా వెంటరాగా
మనసెంత మురిసేను
మదికెంత సంతసము
అది మా సంతకము
దీనజనబాంధవుడు సాయినాధుడొకడే
అది మరువక మనము
సాటిమనిషి మేలును
ఆశిస్తూ కదిలెదము

చరణం
పదిమంది మేలు కోరేను సాయి
కోరికలను తీర్చి సన్మార్గము చూపే
సాయినాధుడుంటే
మనకేల భయము
తన నీడే మన మేడా
తన బోధలతోటి బాధలన్ని తీరు
అది తెలిసిన నాడు చింతన్నది లేదు
దారంతా వెలుగే.. దిగులన్నది లేదు

చరణం
తలచితమా తనను
మదిలోన వెలసి
ధైర్యమే ఒసగును
మనిషన్నవాడు సాయమే చేసి
ముక్తిబాట సాగేందుకు
కదలాలని చెప్పెను
అది మరువక మనము
తనబాటన నడిచెదము
తన నామము పలికెదము
శాంతి సౌఖ్యాలు మనవెంటనె వచ్చునుగావచ్చుని..వచ్చునిక

– సి. యస్. రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *