అలక
అలిగినవ అమ్మాయి….
వెచ్చనైన సూర్యుడి మీద
చల్లనైన చంద్రుడి మీద…
చీకటైన అమాసపై
వెన్నెలమ్మ అలిగినదా….
ఝువ్వు మనే తుమ్మెద
పూలపై వాలినందుకా….
పైనున్న నింగిని
నేల తాకనందుకా…
పెంచుకున్న ఆశలు
నేల రాలినందుకా….
మెత్తని మనసును
గాయపరిచి నందుకా….
వరుడు నచ్చనందుకా…..
అలక తీరనందుకా….
ఇరుచేతులు ఒకదానిపై
ఒకటి అలిగే వీలుందా!….
ఒకరినొకరు చూడక పోయినా
ఇరుకన్నులు ఆలిగే వీలుందా!…..
– హనుమంత