సహనం
కొన్ని ఉషస్సులు….
సాగిపోతున్నాయి…
అంతులేని అంతర్మథనాల నడుమ….
కొన్ని ఘడియలు…
గడవడం గగనం….
విపరీత నిరీక్షణ కాలంలో…
కొన్ని క్షణాలు….
హాయిగొలుపు వసంతాలై…
సీతాకోకచిలుకలు ఎగరవేస్తుంది ఒడిలో….
మరికొన్ని క్షణాలు…
ఎడారి నిట్టూర్పులు మోస్తూ…
పాదాలను… కదలనియవు….
సందిగ్ధంలో….
నవ మాసాల పయనం….
సుదీర్ఘ పరిక్షాలమయం….
దాటేందుకు కావాలి సహనం..
ఓర్చుకోగా దొరుకును…
పండంటి ఒడిలో ముత్యాలహారం….
– కవనవల్లి (సాయిప్రియ బట్టు)