ఋతువులతో నడువలేక!!!
ఆకాశపు రహస్యాలు రంగుల విన్యాసాలతో
అంతులేని ఒడంబడికలు నిలిచిన
తార్కాణాలతో జారిపోయే ఉల్కలు
ఎన్నున్నా ఉలికిపడకా…
జరిగే పరిణామాలు నూతన ఆవిష్కారాల
కోసమని… వసుదైక కుటుంబానికి
నిండు జాబిలి పూర్ణభవించిన తిలకమే…
అడగని జీవితాన్ని యథేచ్చగా సాగించకు
అందెల రవళి కాలేవని పగలబడి నవ్విన
పరిస్థితుల ముందర తలవంచకు…
ఆదెరువు కోసం నూతి ప్రతి బింబాలకు
మొలకవుతు సమీపించిన ఆదేశాలకు
విషతుల్యంకాకు…పిలిచిన ఋతువులతో
నడువలేక నిన్ను వరించిన సంబరాలు
వెన్నెల వెలుగుల నిండు జాబిలిగా
పూయలేవు….
కారణం ఏదైనా కరుణించే గుణం ఉండాలి
కన్నవారే సృష్టిని తెరిచిన ద్వారాలు…
కనుమరుగవుతున్న వారి
ఆధారభిమానాలు నేటి రోజులను
నిలదీయాలి…నీవన్నది ఒక్కటే లోకం కాదు
వారిద్దరు కలిసిన ప్రంపంచాన నడిచేదే మనం
కాయని కొమ్మకు వేలాడకు పూచే మనస్సుతో
నిండు జాబిలివై కనబడు…
నీవన్నది నిజమైనప్పుడు కనబడు
మేమన్నది వాస్తవమై నడవాలి కదా…
కోరికలు బంధిస్తాయి కాలం నడకను
నీకై నిలుపదు విరబూసిన స్నేహం నిరంతరం
నీకొరకై నడుస్తుంది…నిప్పుల వలయంలో
నీవున్నా బొమ్మల కొలువులో దేవుడుంటాడు
పలికిన ప్రతి దేహాన మానవత్వం
నిండు జాబిలిగా వెలగాలి…
-దేరంగుల భైరవ