సిటీ బ్రతుకులు

సిటీ బ్రతుకులు

రమ్య తన చిన్ననాటి స్నేహితురాలు స్వప్న ఇంటికి సిటీ కి వచ్చింది పల్లె నుండి..ఈ మధ్యే స్వప్నకు పెళ్లయింది కొత్త కాపురం చూద్దువురమ్మని పిలిస్తే వచ్చింది రమ్య..స్వప్న భర్త రమేష్ రకరకాల తిను బండారాలు తెచ్చిపెడుతున్నాడు..పిజ్జాలు బర్గర్ లు జ్యూస్ లు ఇలాంటి వన్నీ రమ్యకు తినిపించాడు గెస్ట్ కదాని..స్వప్నకు కూడా ఏ పనీ తగలకుండా కూరలన్నీ కొనుక్కొచ్చే వాడు రైస్ ఒక్కటే వండేది స్వప్న..రోజూ ఒక చోటికి తిప్పి చూడాల్సినవి చూపించారుఇద్దరూ కలిసి..
అలా వాళ్ల మర్యాదలు అందుకుని  ఓ మూడు రోజులుండి వెళ్లి పోయింది రమ్య..

*************

పల్లెలో యథావిధి జీవితం మళ్లీ..రమ్యకు కూడా పెళ్లి చేయాలని ఓ సంబంధం కుదిర్చారు..అతను వ్యవసాయదారు..నాకు వద్దు సిటీ లైఫే కావాలంది రమ్య..మన స్థోమతకు ఈ సంబంధమే సిటీ సంబంధాలు రావమ్మా! ఏం కాదు చేసుకోమని తండ్రి బలవంత పెట్టేసరికి అయ్హిష్టంగానే  చేసుకుంది రమ్య..కానీ అన్నీ పంటలే! పుష్కలమైన తిండి స్వఛ్చమైన గాలి అత్తగారింట్లో ఎంతో బాగుంది..అత్తగారు రకరకాల పిండి వంటలు చేసి పెట్టేది ..చెట్లకు విపరీతమయిన పండ్లు పండేవి ఏ సీజన్ పండ్లు ఆ సీజన్ లో!
అన్నీ బాగున్నాయని తింటూ ఉండేది..

అయినా రమ్యకు అసంతృప్తే!రోజూ మనం సిటీకి వెళదాం! అని పోరు పెట్టేది..రమ్య పోరు పడలేక ఇంట్లో వాళ్లను అడిగాడు అభికొంతకాలం వెళ్లండి రా! మరి అంది అభి వాళ్ల అమ్మ
ఎలా? అమ్మా? నాకక్కడ ఏం జాబ్ ఉంటుంది? ఎలాబ్రతకడం? అన్నాడు..కొంత కాలం మేము పంపిస్తాం! ఈ లోగా ఏదయినా వెతుక్కో! అన్నాడు నాన్న..సరే అని సిటీకి ప్రయాణం అయ్యారు..

ఒక ఇళ్లు అద్దెకు తీసుకుని ఉన్నారు..లేవక ముందే చీకటితోనె డోర్ చప్పుడు..ఎవరా? అని లేచి వెళ్తే చెత్త చెత్త అంటున్నాడు..ఏంటి బాబు? అంది రమ్య..చెత్త ఇవ్వండి మేడం అన్నాడు..చెత్త లేదు ఈ రోజే వచ్చాం రేపటి నుండి రా! అంది వచ్చి పడుకుంది కొద్ది సేపటికే మళ్లీ డోర్ చప్పుడు..లేచి తలుపు తీస్తే పాలు అన్నాడు..పాలు తీసుకుంది..ఏదో సుఖమనుకుంటె ఊర్కే లేవడం..అబ్బా! అనుకుంది..

అభి సూపర్ బజార్ లో జాబ్ సంపాదించాడు కానీ ఆ డబ్బులు ఎటూ సరిపోవడం లేదు..అన్నీ కొనుక్కోవడం నీళ్లతో సహ , పిజ్జాలు బర్గర్ లు ఇంటి అద్దె కట్టడం..ఎటయినా తిరగడంతో ఎక్కడి డబ్బులు చాలడం లేదు..ఇంటి నుండి పంపిన డబ్బులు కూడా!ఇక రాత్రయే సరికి ఏవో చప్పుళ్లు అంతా గోల గోలకొద్ది రోజులుండే సరికి సిటీ లైఫ్ చాలా కష్టమనిపించింది.

ఏం సిటీ బ్రతుకులు బాబోయ్! అని మన ఊరికే వెళ్లిపోదాం! అంది రమ్య..మరి నేను చెప్తే విన్నావా? అన్నాడు అభి..నాది తప్పే అంది రమ్య..
పాడయిన ఆరోగ్యాలతో పల్లె దారి పట్టారు అభి రమ్యలు..

పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏం లాభం? అనుకుంది మనసులో రమ్య..

 

 

–  ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *