రైతక్క

రైతక్క

 

వ్యవసాయంలో మూడంతుల సాయం నీదే!
పంట వేసిన నుండి అన్నం వడ్డించే వరకు నీ భాగస్వామ్యం అనంతం! అయినా నీ ఉనికికి లేదు గుర్తింపు!
కొత్త వ్యవసాయ చట్టాలు కోకొల్లలుగా వచ్చినా
ఒరిగిందేమీ లేదు నీకు!
ఆహార పంటలకు ఆయువు నీవు! వ్యాపార పంటలకు ఊతం నీవు!
ఆరుగాలం శ్రమించి మట్టిలోంచి మెతుకులు పుట్టించే నీకు
నీ భూమిపైనే నిర్ణయాధికారం లేదు!
ఆర్థిక న్యాయం అసలే లేదు!
వ్యవసాయమంటే అక్షరాలా రూపుకట్టేది
పురుషస్వామ్య భావజాలపు ప్రతీకలే!
అన్నదాత అంటే కనిపించేది
రైతన్న వ్యధలే కానీ
కనిపించని నీ కన్నీటి కథలెన్నో!

 

-మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *