ప్రియురాలికి ప్రేమలేఖ
నేను నీ కోసం ప్రేమలేఖ రాసి,
నా మనసులో భావోద్వేగాలన్నీ కలిసి,
నీ కోసం తపించే నా మనసుని,
కళ్ళాకపటం లేని నా ప్రేమని, మనసులో బాధలని మరిపించే,
మనసుకి నష్టం చేసే విషయాలని నాశనం కలిగించే,
తన ఆలోచన నన్ను సదా మైమరిపించే,
ఊహ గురించి తెలియచేయలని నా మనసుకి అనిపించే.
ఏమో తెలీదు కాని నువ్వు పక్కనే ఉండి నవ్వుతూ మాట్లాడితే నాకు నవ్వొస్తుంది,
నాన్న కోపం కూడా ప్రేమగీతం లాగా వినిపిస్తుంది,
నా కవిత నన్ను నా ప్రేమని గెలిపిస్తుందని ఆశిస్తూ,
నీ వాత్సల్యం కోసం రమిస్తూ,
– హరీశ్వర