ప్రేమ లోకం అంటే?
లోకం లో ప్రేమ అనేది ఎక్కడా లేదు. స్వార్థం తప్ప, ఎక్కడ చూసినా స్వార్థమైన ప్రేమ తప్ప మంచి మనసున్న ప్రేమ ఎక్కడా లేదు. రకరకాల ప్రేమలు రంగు పులుముకున్నాయి. ఒకవేళ నిజంగా ప్రేమ లోకం అంటే ఎలా ఉంటుందో అనే ఊహా తో రాస్తున్న….
ప్రేమ లోకం లో ఒకరిని ఒకరు దూషిoచుకోరు. ప్రేమ లోకం లో ఒకరి పై మరొకరికి అంతులేని ప్రేమ ఉంటుంది. ఆ లోకం లో ఎలాంటి భేషజాలు ఉండవు. ఎలాంటి కక్షలు, కార్పణ్యాలు ఉండవు.
ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆప్యాయత, అనురాగాలు కలగలిపి ఉంటుంది. డబ్బు కోసం ఒకర్ని ఒకరు చంపుకోవడం ఉండదు. సాటి మనిషిని ప్రేమ తో చూస్తారు.
మనిషి మనుగడ కోసం ఎవర్నీ అణచి వేయడానికి చూడరు. అందంగా ఉంటుంది ఆ లోకం. సప్త వర్ణాల కలయికగా, ఏడేడు లోకాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
అంతటి ప్రేమ లోకం చూడగలిగే భాగ్యం మనకు లేదా అంటే ఉందనే చెప్పొచ్చు. ఏదైనా మనం చూసే చూపుల్లో ఉందని అంటారు. కానీ అది నిజం కాదు.
మనం పైకి వెళుతూ ఉంటే ఇంకొకరు కిందకి లాగాలని చూస్తారు. అలాంటి స్వార్థ చింతన పెరుగుతుంది అందరికీ… అందుకే నేను నా ఊహల్లో చూసే అందమైన ప్రేమ లోకం గురించి చెప్పాలనుకున్నా.
ఆ ప్రేమ లోకం అంతా రంగుల ప్రపంచం లాగా ఉంటుంది. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనే భేషజాలు ఉండవు. ఒకరి పై మరొకరికి కోపతాపాలు, అలకలు, గొడవలు, కులాలు మతాలు, ఘర్షణలు అంటూ ఏమీ ఉండవు.
అంతా ఒక్కటే మానవులంతా సమానమే అంటూ ఒకే రీతిగా ఒకే మాటగా ఉంటారు. బాధలు, దు:ఖాలు , ఏడుపులు,పెడబొబ్బలు, మానభంగాలు, హత్య చారాలు, అలజడులు ఉండవు.
ప్రేమంటే శారీరకంగా కాదు, మానసిక ప్రేమ, ఒకర్నొకరు గౌరవించడం, ఒకర్నొకరు ప్రేమతో పలకరించుకోవడం, ఒకరి పై మరోకరు నమ్మకం తో ఉండడం.ఇలా నేను ఉహించిన ప్రేమలోకం లో ఉంటారు.
ప్రేమలోకం లో ఒకరికి ఒకరు చేయూత అందిస్తారు. ఇక్కడ ఈ ప్రేమలోకంలో ప్రేమే మంత్రం, ప్రేమే శ్వాస గా మారిపోతుంది. మనిషి స్వార్థం వీడిన నాడు ఇవన్నీ జరుగుతాయి. జరగాలని కోరుకుంటూ….
ఇలాంటి ప్రేమ లోకం లో నేనొక బిందువుగా మారితే నా జన్మ ధన్యం అయినట్టే….
– అర్చన
Superb, Archana Garu. Hats off.