ప్రాణం
ప్రాణం అంటే తీపి
ఉండును కదరా అందరికి.
కన్న తల్లి ని చేర్చకురా
ఈ జాబితా లోకి !
అమ్మకి ప్రాణం అంటే
తనది కాదురా !
పురిటి నొప్పులు ఊపిరులు తీస్తుండగా
ఊపిరులు పోసుకున్న నువ్వురా, ఆమె ప్రాణం.
కంట్లో పడిన నలుసు
క్షణ కాలం కవ్వించునురా.
నీ అసహనాన్ని ఎరుపెక్కిన నీ కళ్ళు
చూపునురా చెప్పకనే —!
కడుపులో పడిన నలుసు
కవ్వించునురా, ఆఁ తల్లిని, నవమాసాలు.
ముసి, ముసిగా మురుస్తున్న ఆఁ కళ్ళ
సహనం నీ కొరకేరా !
అది నిలుచునురా ఆఁ తల్లి కడదాకా !
– వాసు