పిడుగు
1) ఉక్కపోత పోసి ఉరుములు మెరుపులు
పిక్కటిల్లి పగలు పిడుగు రాలె
పిడుగు పాటు వల్ల పిల్లజెల్లా జచ్చె
చెలకలోన ఎడ్లు చేష్ట లుడిగె
2) ఆక్సిడెంట్ వల్ల అయిన వారూ పోతె
హాస్పిటలున చేర్చిరపరిచితులు
ఫోను చేసి చెప్పె పోయిన వార్తను
పిడుగు వార్తను విని పీనుగయ్యె
3) పంచభూతములను బాధించు మనిషిని
పట్టు బట్టి పిడుగు మట్టుబెట్టె
పిడుగు వార్త విన్న పిల్లలు పెద్దలు
గుండెపోటు వచ్చి గుటుకు మనిరి
– కోట