పిడుగు
ఉరుములు మెరుపులు వచ్చి పిడుగులు పడుతున్నాయా అంటే
అర్జునా పాల్గునా అనమంటారు పెద్దలు
అది మహాభారతంలోని
కథ కావచ్చు కాని ఇప్పటి
కాలంలో ఏమన్నా ఏ ది
ఆగేటట్టు లేదు సుమా
మారుతున్న కలికాలంలో
ప్రతిరోజూ సామాన్యుడి మీద
పిడుగులు పడుతూనే
వుంటాయి అనేక రకాలుగా
ప్రపంచంలో ఏదో ఒక రకమైన వైపరీత్యాల రూపంలో భాదేస్తూనే
వున్నాయి కదా
ప్రపంచ వ్యాప్తంగా
మహమ్మారి పిడుగు
దేశాల మీద బాంబుల పిడుగు
నేల మీదకు మెరుపులా వచ్చి చప్పుళ్ళతో
అనార్డాల పిడుగు
మనిషి బ్రతుకు పోరాటం
లో అనుకొలేని ధరల పిడుగు
అందుకోలేని అవకాశాలు
ప్రాణాలకు పరిహారము లేని
సంఘర్షణల పిడుగు
వున్నది వున్నట్టుగా కాక
వూహకందని వార్తల
పిడుగు
ఆకాశం నీలిమేఘాల లో
వాయు కాలుష్యపు పిడుగు
అన్నీ కలిపి బతుకు బండిపై
ప్రమాదపు పిడుగులు
పడుతూనే వుంటున్నవి
దారిలేక దాచుకునే ప్రయత్నించినా అందని
ఆకాశాన్ని పట్టుకున్నట్టే ….
– జి జయ