పెళ్లి నా ప్రాణం తీసింది

పెళ్లి నా ప్రాణం తీసింది

 

అతని పేరు సిద్దుఅతను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి సిద్దుకి జాబ్ లేదని వదిలేసింది.సిద్దు చాలా బాధ పడ్డాడు,
నాకు ఎవ్వరు లేరు, అని చని పోవాలని అనుకున్నాడు, పక్కనే ఉన్న గుడికి వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకొని తన బాధనంతా ఆ దేవుడికి చెప్పుకున్నాడు,గుడి పక్కన ఉన్న పెద్ద లోయ ఉంది.సిద్దు అక్కడికి వెళ్లి దూకబోయే సమయానికి ఒక అమ్మాయి వచ్చింది.ఆగండి అందులో పడితే చనిపోతారు, అంది.

సిద్దు: నాకు తెలుసు నేను చనిపొడనికే వెళ్తున్నా..!

ఆ అమ్మాయి: ఏమైందండి.ఎందుకు చనిపోవలనుకుంటున్నాను.

సిద్దు: ఎవ్వరండి బాబు మీరు

ఆ అమ్మాయి: నా పేరు ప్రియ మీరు ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నారు,చెప్పండి.

సిద్దు: మీకు ఎందుకండి

ప్రియ: మీ బాధ చెప్తేనే కదా!మీకు కొంచం బాధ దాగ్గుంది.

సిద్దు:అవి నా పర్సనల్

ప్రియ: ఎలాగో మీరు చనిపోవాలని అనుకుంటున్నారు, కదా!నేను తెలుసుకుంటా..

సిద్దు: సరే చెప్తా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నాకు జాబ్ డబ్బు లేదని నా ఫ్రెండ్ ని ప్రేమించింది.నేను ఆ మోసాని తట్టుకోలేకపోతున్న అందుకే చనిపోవాలని అనుకుంటున్నా..!

ప్రియ: అప్పడే అనుకున్న అమ్మాయి కోసమే మీరు చనిపోయేది.అని

సిద్దు: ఇంకా నేను చావచ్చ అండి

ప్రియ: చనిపోదురులే కానీ నాతో 2గంటలు వస్తారా..

సిద్దు: ఎక్కడికండి

ప్రియ: నాతో రండి చెప్తా..

సిద్దు: సరే అండి

ప్రియ: అరే నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడేంటి

సిద్దు: అతను మీకు తెలుసా..

ప్రియ: నేను చదివిన కాలేజ్ లో అతను నా బెస్ట్ ఫ్రెండ్ తన పేరు రామ్ తనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. కానీ కార్ డ్రైవర్ గా ఎందుకు చేస్తున్నాడో అడిగి రపొండి,

సిద్దు: మీరే అడగచ్చు కదా!

ప్రియ: ఈ 2గంటలు నేను చెప్పింది మీరు చెయ్యండి, ఎందుకు అని అడగకండి,

సిద్దు: సరే అండి అని వెళ్లి హాయ్ అండి

రామ్: ఎవ్వరండీ మీరు

సిద్దు: నా పేరు సిద్దు అండి మీకు డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది.కాదండి,

రామ్: హా అండి

సిద్దు: మరి డ్రైవర్ ఎందుకు పని చేస్తున్నారు,

రామ్: జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళిన 2.00.000 ఇమాంటున్నారు, మా అమ్మ నాన్న కూలీ పని చేస్తాడు, అంత డబ్బు మాకు ఎక్కడ నుంచి వస్తుంది.మంచి జాబ్ తెచ్చుకొని అమ్మ నాన్నల్ని బాగా చూసుకుందాం.. అనుకున్న.. చాలా కలలు కన్న అవి నిజం కావు అని తెలిసి చనిపోదాం అనుకున్న.. మా అమ్మ నాన్న గుర్తు వచ్చి అగిపోయా… రెంటుకు కార్ తెచ్చుకొని నడుపుకుంటున్న..!

సిద్దు: మీరు హ్యాపీగా ఉన్నారా..!

రామ్: నేను చనిపోయి ఉంటే మా అమ్మ నాన్నలు చాలా బాధ పడి ఉండేవారు, అమ్మ నాన్నలు చానా కష్టపడ్డారు, ఇప్పుడు నేను కష్ట పడి వాళ్ళని బాగా చూసుకోవాలని అనుకున్న..! బాస్ మనం ఆశపడింది.మనకి దూరమైతే ఎదురు చూడాలి.చనిపోకూడదు? మన కన్న వాళ్ళు మనమే ప్రపచంగా బ్రతికేవాళ్లు ప్రాణం కూడా పోతుంది. ఓకే అండి టైం అవుతుంది.

ప్రియ: వెళ్దామా

సిద్దు:హా అండి

ప్రియ: ఈ వయసులో ఆ అవ్వ పూలు ఎందుకు అమ్ముకుంటుందో అడిగి రాపోండి,

సిద్దు: అసలు మీరు ఏం చెప్పాలి. అనుకుంటున్నారు,

ప్రియ: తర్వాత చెప్తా ఇప్పుడు నేను చెప్పింది. చేయండి.

సిద్దు వెళ్లి 10 నిమిషాల తర్వాత ప్రియ దగ్గరకు వెళ్ళాడు,

ప్రియ: ఏం చెప్పింది. ఆ అవ్వ

సిద్దు: కొడుకులు వదిలేశారంటా.. బ్రతికే దారే లేక తోటలో పువ్వులు కోసి ఇక్కడికి తెచ్చి అమ్ముతోంది. అంటా..!

ప్రియ: అక్కడ ఎవ్వరో చనిపోయినట్టు ఉన్నారు వెళ్లి చూడండి.

సిద్దు: హా తర్వాత

ప్రియ: ఏమంటా..!

సిద్దు: ఆ అబ్బాయిని ఎవ్వరో అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకున్నాడు,పాపం వాళ్ల అమ్మ నాన్నలు చాలా ఏడుస్తున్నారు,

ప్రియ: నిన్న కాక మొన్న పరిచయం ఇయిన అమ్మాయి కోసం ప్రాణమే ఇస్తున్నారు, ప్రాణం పోసిన అమ్మ నాన్నల్ని కన్నీళ్ళ శూన్యంలోకి నెట్టేసి వెళ్లిపోతున్నారు, ఇది ఏమ్ ప్రేమ

సిద్దు: అసలు ఇదంత నాకు ఎందుకు చెప్తున్నారో నాకు  ఏం అర్థం కావట్లేదు?

ప్రియ: ఇంకా అర్థం కాలేదా గోల్డ్ మెడల్ సంపాదించిన అతను డ్రైవర్ గా పని చేస్తూ తన వాళ్ల కోసం ఆనందంగా బ్రతుకుతున్నాడు,కొడుకుల దగ్గర బ్రటకాల్సిన ఆ అవ్వ నారి రోడ్ మీద పడితే ఆ అవ్వ చావలని అనుకోలేదే ఉన్నంత కాలం ఒకరి మీద ఆధార పడకూడదు అని కష్ట పడుతూ ఆనందంగా బ్రతుకుతుంది. ఈ బ్రతుకు ఎందుకు అని చనిపోవాలని అనుకోలేదు?

ఆ అవ్వ , అబ్బాయి చనిపోయినప్పుడు తన ఫ్యామిలీ ఎంతగా బాధ పడ్డారో చూశావు? కదా! నీ ఫ్యామిలీ అలా బాధ పెడతావా..!
నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి బాగానే ఉంది.

నువ్వు ఎందుకు చావాలి. నీలాంటి అబ్బాయిని మిస్స్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధ పడాలి.  ఇంతలో ఒక అతను వచ్చి అప్పటి నుండి చూస్తున్న మీరు ఎవ్వరితో మాట్లాడుతున్నారు, అండి అంటూ అడిగాడు సిద్దు ని.

సిద్దు: ఈ అమ్మాయి ప్రియ నా ఫ్రెండ్ తను.

పంతుల్ గారు: మీ పక్కన ఏ అమ్మాయి లేదు?

సిద్దు: ఇక్కడే ఉంది. కదండి.

పంతుల్ గారు: పొద్దునే పిచ్చోని కలిశానే అని వెళ్ళిపోయాడు,

ప్రియ:నేను ఎవ్వరికీ కనిపించను. నేను చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. దాంతో సిద్దు షాక్ అయ్యాడు, నోట మాట రాలేదు, ఎలాగో  గొంతు పెగుల్చుకుని

సిద్దు: ఏం మాట్లాడుతున్నారండి

ప్రియ: నిజమండి మా అమ్మ మాకు చిన్నప్పుడే దూరం చేశాడు ఆ దేవుడు నన్ను నా చెల్లిని ఉన్నంతలో చాలా బాగా పెచ్చారు, మా నాన్న నేను డిగ్రీ చేశాను.
అప్పుడే నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది.పెద్ద వాళ్ళు, నాన్న ఆ అబ్బాయి మంచివాడు అనుకోని నన్ను ఇచ్చి పెళ్లి చేశారు,

ప్రియ: పెళ్లి ఐన 4నెలలకి తెలిసింది.తనికి లేని అలవాటు అంటూ లేదని రోజు తాగి వచ్చి కొట్టేవాడు మా వాళ్ళతో మాట్లాడుతింటే అనుమానం చూసేవాడు మా ఇంటికి వెళ్లి మా నాన్నని పట్టుకొని ఏడవలనిపించెది.కానీ నాకు ఒక చెల్లి ఉంది.నేను పెళ్లి ఐన 4 నెలలకే మా ఇంటికి వెళ్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు,
నా చెల్లికి పెళ్లి కూడా అవ్వదు?

నాన్న చాలా బాధ పడతారు, ఎన్ని కష్టాలు వచ్చినా పుట్టింటికి వెళ్ళకూడదు? మంచి జాబ్ తెచ్చుకొని ఈ ఇంటి నుండి బయట పడాలి.అనుకున్న..! అతనికి తెలియకుండా జాబ్ కోసం ట్రై చేశా..వాళ్ళు నాలో ట్యాలెంట్ ను చూడటంలేదు?

నన్ను ఒక రోజు నా రూమ్ కి రా అని అంటున్నాడు, అలా అనందుకు ఒక అతని చెప్పుతో కొట్టాను,అతను నాకు ఎక్కడ జాబ్ రాకుండా చేశాడు, ఆప్పుడు నాకు చావడం తప్ప వేరే దారి కనిపించలేదు? చెయ్యి కోసుకున్న

పది నిమిషాల తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది.హెలో ఎవ్వరు అతను.నా పేరు రఘు మీకు మా అఫీస్ లో జాబ్ ఇస్తున్నాం నెలకి 30.000 వేలు ఇస్తాం మా అఫీస్ లో చేస్తారా..!
అప్పటికే నా ప్రాణం గాల్లో కలిసపోయింది. తర్వాత నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్ళారు, డాక్టర్ ఈ అమ్మాయి గర్బవతి అని చెప్పారు, అప్పుడు నేనే ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలిసింది.

నేను ఒక్క క్షణం ఆలోచించి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. నేను చేసిన తప్పే మీరు చెయ్యకండి,ఒక ప్రేమ దూరమైతే ఇంకా జీవితమే లేదు? అనుకోకండి.
ఏదోక రోజు నిన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మీకు భార్యగా వస్తుంది. మీరు చాలా ఆనందంగా ఉంటావు? ఇంకా నాకు టైం అవుతుంది. నేను వెళ్ళాలి. బై సిద్దు అని వెళ్లిపోయింది.

సిద్దు: నిన్ను ఈ ప్రాణం పోయే వరకు నిన్ను ఒక మంచి ఫ్రెండ్ గా గుర్తు ఉంచుకుంటా..! ఇప్పుడు సిద్దు వాళ్ల అమ్మ నాన్నతో ఆనందంగా ఉన్నాడు

దీన్ని  బట్టి నేను చెప్పేది.ఏంటంటే మనము కన్న కలలు ఈ రోజు కాకపోతే ఏదోక రోజు నిజమౌతాయి. ఒక్క సారి ప్రాణం పోతే మళ్లీ తిరిగి రాదు .

 

-మంజులత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *