ప్రేమ – పెళ్లి

ప్రేమ-పెళ్లి

 

నయన మేధ ఇద్దరూ చిన్నప్పటి ఫ్రెండ్స్..కలిసే చదువుకున్నారు ఆడుకున్నారు ఒకే లోకంగాబ్రతికారు..ఇంటర్ వరకు వచ్చాక విడిపోక తప్పలేదు చెరో కాలేజ్
లో జాయిన్ అయ్యారు..అన్నిట్లో ఏకాభి ప్రాయమే!వేరు వేరు కాలేజ్ లలో చదువుతున్నా ఇంటికి రాగానెకలుసుకుని ముచ్చట్లు పెట్టుకునే వాల్లు..
అన్నీ షేర్ చేసుకుంటారు..

నయన కాలేజ్ లో ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉండేదిఆ విషయం మేధకు ఎపుడూ చెప్తుండె..అలా ఉండకూడదు ఎందుకు నయనా మీ క్లాసులోఆడ పిల్లలే లేరా? అతనితో ఎందుకు? అంది మేధ..ఏమెానె నాకు అతనంటె చాలా ఇష్టం అంది నయనఅలా ఇష్టపడడం మెుదలు పెట్టకు అది వేరే దానికి దారి తీస్తుంది అంది మేధ..

దీంతో చెప్తే ఆరిందలా మాట్లాడుతుంది చెప్పక పోవడమే బెటర్ అనుకుంది..అప్పటి నుండి చెప్పడం మానేసింది కానీ ఆ పరిచయంముదిరి పోయి ప్రేమగా మారిపోయింది..

ఒకరోజు ఉండబట్ట లేక మళ్లీ చెప్పింది మేధకు..అయ్యెా! అలా చేయవద్దు ఈ వయసులో ప్రేమేంటి?బాగా చదువుకోవాలి అని కోప్పడింది..సరెలేవే! అని ఆ సమయంలో తన మాట విన్నట్టే చేసింది..ఇంటర్ అయిపోయి డిగ్రీకి వెళ్లాక రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకుందా మనుకున్నారు..

మేధకు తెలిసి చాలా కోప్పడింది..నేను ముందే చెప్పాను కదా! పరిచయం పెంచు కోవద్దని చెప్తే వినవు..పెద్దలు కుదిర్చిన పెళ్లే మంచిది అమ్మా నాన్నలను మాత్రం ఎదిరించకు వాళ్లకు చెప్పు..వాళ్లు ఒప్పుకుని చేస్తే పెళ్లి చేసుకో! లేకపోతె మానుకో! అంది..

నీ ముఖం మా ప్రేమ నాలుగేళ్లుగా సాగుతుంది నీకుప్రేమ విలువ తెలియదు..మా అమ్మ వాళ్లకు చెప్తే అస్సలు ఒప్పుకోరు మేము
రెండు రోజుల్లో పెళ్లి చేసుకుంటాం! నీకిష్టమయితే రా!లేకపోతె లేదు అంది నయన..అయితే నీ ఖర్మ నువ్వే అనుభవించు అంది మేధ..

**

మేధ వాళ్ల పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది నయనప్రేమ పెళ్లే చేసుకుంది..కొంతకాలానికి ఇద్దరూ మళ్లీ కలుసు కున్నారు ..మేధనేమెా మంచి పొజిషన్ లో గొప్పగా బ్రతుకుతుంది
నయన నేమెా పేదరికంలో మగ్గి పోతుంది..నయన భర్త చదువు మధ్యలోనె ఆగిపోయి మంచి ఉధ్యోగం లేక ఇరు వర్గాల పెద్దల సపోర్ట్ లేక నానా
ఇబ్బందులు పడుతున్నారు..

మేధ చాలా సంతోషంగా జీవితం గడుపుతుంది..అప్పుడంది నయన మేధతో..నువ్వు చెప్పిన మాట పెడ చెవిన పెట్టాను నిజంగాపెద్దలు కుదిర్చిన పెళ్లే బాగుంటుంది అని..చేతులు కాలాక ఆకులు పట్టుకుంటె ఏం లాభం?

అందుకే నేటి అమ్మాయిలూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి..

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *