పెళ్ళి

పెళ్ళి

 

తన కుమార్తె రోజాకు పెళ్ళి చేద్దామని అనకుని మంచిసంబంధం కోసం మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించాడు ఈశ్వర్. తన కూతురు జాతకం, చదువు వివరాలు
అన్నీ వారికి ఇచ్చాడు. తన కూతురుకి అమెరికా సంబంధం కావాలని చెప్పాడు ఈశ్వర్. పూర్వం జీవిత భాగస్వామి ఎవరవుతారో స్వర్గంలోనే వ్రాసి పెట్టబడి ఉంటుంది
అని అనేవారు.

కానీ ఇప్పుడుమాత్రం మ్యారేజ్ బ్యూరోలో వ్రాసి ఉంటుంది అనేది నేటి మాట. ఇదివరకు పెళ్ళి సంబంధాలు కుదిర్చేటప్పుడు అటు ఏడు తరాలు,ఇటు ఏడు తరాలు చూసిన తర్వాతే పెళ్ళిళ్ళు కుదిర్చేవారు. ఇప్పుడు మాత్రం వారిఆర్థిక పరిస్థితి బాగుంటేనేపెళ్ళి సంబంధాలను కుదుర్చుకుంటున్నారు.మొత్తానికి రోజాకు మంచి
సంబంధం కుదిర్చారు .

కుర్రాడి పేరు రాజా. అమ్మాయిపేరు రోజా. వెయ్యి అబద్ధాలుచెప్పి అయినా ఒక పెళ్ళి చేయాలి అని పూర్వం అనేవారు కాని అసలేఅబద్ధం చెప్పకుండానే
పెళ్ళి కుదిరింది. పిల్ల తండ్రి ఈశ్వర్ సంతోషించాడు.అన్ని విషయాలు బహిరంగంగా చర్చించుకుని పెళ్లి సంబంధం
కుదుర్చుకున్నారు.

ఆ తర్వాత నుండే అసలైన సందడి మొదలైంది. పెళ్ళి పందిరి వేసేవాడు ఫోన్ చేసాడు. ఆ తర్వాత షామియానా వాడు, క్యాటరింగ్ వాడు, పంతులు గారు, పచారీ షాపువాడు
కూడా ఫోన్ చేయసాగారు. ఆఖరికి పెళ్ళి అయినాక హనీమూన్ వెళ్ళేందుకు ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేస్తామని అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ప్రైవేటు టూరిజం
వారు ఫోన్ మీద ఫోన్ చేయసాగారు.

ఈశ్వర్ఖంగారు పడ్డాడు. “వారికితన ఫోన్ నంబర్ ఇవ్వలేదు.మరి వారికెలా మా అమ్మాయిపెళ్ళి కుదిరిందని తెలిసింది”అని మితృనితో అన్నాడు.”ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళేఅందరికీ నీ ఫోన్ నంబరు ఇచ్చి ఉంటాడు” అని నవ్వుతూ అన్నాడు మితృడు.ఒకవైపు కూతురికి మంచి సంబంధం కుదిరిందనే ఆనందం మరో వైపు ఈఫోన్లు. ఆఖరికి పెళ్ళైన తర్వాత కొత్త దంపతులు ఉండేదుకు ఎపార్టమెంట్రెడీగా ఉందని ఒక బిల్డర్ వెంటపడసాగాడు.

ఇంకొకడు కారు కావాలాసారూ అని మెసేజులు పెడుతున్నాడు. ఇదివరకుపెళ్ళి పందిళ్ళ ఏర్పాట్లు,బంతి భోజనాల ఏర్పాట్లు, మంగళ వాయిద్యాల వారినివెతికిపట్టుకోవటం పెద్ద పనిలా
ఉండేది. ఇప్పుడు ఈశ్వర్ పని తేలికయింది. అన్నీ చిటికెలోఏర్పాటు అయిపోతున్నాయి.
పెళ్లి ఘనంగా జరిగింది.

ఎంతఘనంగా జరిగింది అంటే పెళ్లికి ముందు సొంత ఇంట్లో ఉండే ఈశ్వర్ కూతురు పెళ్ళి అయ్యాక అద్దె ఇంట్లోకివచ్చేసాడు🙂. అయినా అతనికి తృప్తిగానే ఉంది. కూతురు పెళ్లి ఘనంగాచేసాననే తృప్తి. అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అని పెద్దలంటూ ఉంటారు.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

0 Replies to “పెళ్ళి”

  1. ఇల్లు కట్టి చూడు. పెళ్ళి చేసి చూడు అనే మాటలు అక్షర సత్యాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *