పర్యావరణ విలువ

పర్యావరణ విలువ

పక్షుల కిలకిల లు
మామిడాకుల గగలగలలు
కూ అనే కోయిల మధురిమలు
కావు కావంటూ చట్టాలను పిలిచే నేస్తాలు
అంబా అంటూ అమ్మ కోసం ఎదురుచూసే గోమాతకు
ఎద్దులబండికి ఉన్న అందెల మృదుమధుర సవ్వడులు, కొలనులోని హంసల సరిగమలు
పంచె వన్నెల రామచిలుక రాగాలు మే అంటూ నేస్తలని పిలిచే మేకల గుంపులు,

నింగి మొత్తం నాడేనంటు డేగ రెక్కల శబ్దాలు, గుక్ ఘుక్ అంటూ పొద్దున్నే నిద్ర లేపే పావురాయి కువకువలు…
ఇవ్వన్నీ ఒకప్పటి పల్లె చిత్రాలు..
మరిప్పుడు ఆకాశాన్ని తాకే మేడల నడుమ
గుళ్లకు చోటెక్కడ, కరెంటు తీగలు, గాలి పటాల దారాల మధ్య నలిగి గిలగిలా కొట్టుకుంటూ,

తినడానికి గింజలు కరువై, ప్లాస్టిక్ కవర్లు తింటూ అవి అరగక వాటిలో ఉన్న విషం తమని నిలువెల్లా చంపేస్తుంటే
ఇంకా వాటి ఉనికి ఎక్కడ? మిడతల నుండి కాపాడుకోవడానికి పావురాలను అరువు తెచ్చుకుని ప్రారబ్ధం దాపురించింది.

ఇదంతా మన పుణ్యమే కదా చెరువు లు, కుంటలు, పచ్చని అడవులను నరికేసి

మేడలు, మిద్దెలు కడుతూ పొగిపోతూ పక్షి ప్రాణులను చంపుకుంటున్నం అనే ఇంగిత జ్ఞానం లేకుండా,

పక్షులు అంటే ఇదిగో ఇలా ఉండేవి అంటూ మన ముందు తరాలకు చూపడానికి మ్యూజియం లో చుపెట్టే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం…

ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అడవులను పెంచితే తిరిగి పక్షుల రాక సంతోషాన్ని ఇవ్వదా,

మన పిల్లలకు దగ్గర నుండి చూసే భాగ్యం కలగదా, పర్యావరణాన్ని కాపాడండి పక్షులను పెంచండి.

ఇప్పటికే చాలా రకాల పక్షులు కనుమరుగు అయ్యాయి. ఫ్యాక్టరీల విష వాయువులను పిలుస్తూ నెలరాలిపోయాయి.

ఇప్పటికైనా కళ్లు తెరిచి మన వంతుగా కనీసం ఒక మొక్కను నాటుదాం. మన పిల్లలకి పక్షుల, పర్యావరణ విలువను తెలుపదాం.

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *