పరువు హత్య
పరువు పరువు అని దాన్ని
కోసం పాకులాడుతూ పరువు
పోతే ప్రాణాలు తీసుకోవడం
ఎంత వరకు న్యాయం…
కూతురు ఎవరిని ప్రేమించిన
ఆ ప్రేమని ఒప్పుకోలేదు అని
వాడితో వెళ్లిపోయిందని
కోపంతో రగిలిపోతూ కన్న కూతురు
అని చూడకుండా హత్య చేసేశారు..
తెలిసిన వాళ్ళ దగ్గర తన పరువు
పోయిందని కూతురి మీద
పగ పెంచుకొని వాళ్ళని
అతి దారుణంగా చంపేశారు..
ప్రేమకి కులం, మతం, ప్రాంతం
అసలు ఎందుకు చూస్తున్నారో
నాకు మాత్రం అర్దం కావడం లేదు…
వాళ్ళని చంపి కడుపు కోత మిల్చుకుంటున్నారు…
పరువు హత్యలు చేస్తున్నారు..
– మాధవి కాళ్ల