పనిలేక రాసిన లేఖకు …పనిగట్టుకుని రాసిన ప్రత్యుఉత్తరం
నీ ఉత్తరం అందింది . సరిగ్గా నేను మొక్కలకు నీళ్ళు పోసి సమయానికి పేపర్ ను నా డిప్ప మీదకు విసిరినావ్ కదా ఫస్ట్ నొప్పికి తాలలేక నిన్ను మా బర్రె తాగే కుడితిలో ముంచి ముంచి చంపాలి అనిపించింది మల్ల నీ లేక సదివినాక ఒకటే సిగ్గు అందుకే ఇంక ఆలోచన మనుకున్న …..
అబ్బబ్బ ఎం రాసినావు ఎం రాసినావు నిజంగా చాలా నచ్చేసింది …నీ ఉత్తరం
ఫస్ట్ అయితే నీకు వాంతులు విరోచనాలు అయినాయని అనందంగా ఉంధి అధి నా వల్ల అంటే మహదానందంగా ఉంధి ……
నిజం చెప్పలంటే నాకు నీ మీద లవ్వు ఉంధి కానీ నీ మాదిరి వాంతులు విరోచనాలు కాలే అదే అనుమానంగా ఉంధి…… నాది నిజమైన ప్రేమా కాదా అని…..
ఆరోజు నేను బర్రె ను తోముతున్నప్పుడు నేను కూడా నిన్ను చూసా నువ్వు తల అల ఊపుతుంటే అచ్ఛం మా బర్రె ను చూసినట్టే అనిపించింది
బలే ముద్దుగా ఉన్నావ్లే….
భహుస అందుకేనేమో నాకు నిన్ను చూసాక పెద్దగా ఎమి అనిపించల నేను రోజూ మా బర్రె ను చూస్తూనే ఉంటా కదా…..కానీ నువ్వేమో నాలాంటి అందాల రాశిని మొదటిసారి చూసి ఉంటావు అందుకే నీకు వాంతులు విరోచనాలు….. అంతే…
మొన్న నువ్వు వేపపుల్ల నములుతూ ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ వస్తుంటే మన గల్లీకి ఇంక గూర్క అవసరం ఉండదేమో అనిపిస్తుంది…….
నీదేన పొకెట్ ఫ్రెండ్లీ బుర్ర మాది కూడా
అసలు నేను నిన్ను ప్రేమించిందే అల ఆలోచించే
ఎలా అని చించకూ నీ చీమలు కుట్టేసిన బుర్ర కి రూపాయికి నాలుగూ టావులు రెండు రూపాయిల టి లు తప్పితే ఇంకేం తెలీదు కానీ నేను అల కాదు నిన్ను ప్రేమిస్తే నాకు ఎన్ని లాభాలో …..
1) పొద్దునే నువ్వు పల్లు తోమడానికి వాడేది వేప పుల్లు కాబట్టి బృష్ కి పది రూపాయలు మిగులుతుంది
2) స్నానానికి మా బర్రె తో పాటు నిన్ను కూడా తోమితే సరి కాబట్టి ఇరవై రూపాయిల సబ్బు రూపాయి షాంపూ మిగులుతుంది
3) ఇంక నువ్వూ కట్టుకునేది లుంగీ నా పాత చీరలు ఆ మూల ఈ మూల కలిపి కుట్టేస్తే సరి.. లుంగీ కి యాభై రూపాయిలు మిగులుతుంది….
4) ఎలాగూ నా మొహం చూస్తే నీకు వాంతులు అవుతాయి కాబట్టి తిండి పెట్టే పని లేదు
5) సాయంత్రాలు నీతో గుర్కా పని చెయిచ్చి మన గల్లీ ఒడే అని ఇంటికి ఇరవై రూపాయిలు లాగచ్చు
6) నువ్వు పడుకోడానికి బర్రెల పక్కన స్థలం సరిపోతుంది… మంచానికి పరుపుకి కూడా డబ్బులు మిగులుతాయి ….
7) యెద్దుల కు బదులు నీతో పొలం దున్నిస్తే కనీసం పది వేలు మిగులుతాది
అమ్మా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి లే..
చూసావా నువ్వు రూపాయి కూడబెట్టి పెద్ద గొప్పలు పోయావు నేను చూడు ఎంత దాస్తున్నానో పైన అన్ని చూసి నిన్ను పీల్చి పిప్పి చేస్తా అనుకోకు అదంతా ఫ్యూచర్ ప్లనింగ్స్ హా…..
అసలే నేను బిజినెస్ ఊమెన్ నీ కాస్త సేవింగ్స్ చేసుకోవాలి కదా
మొన్న రాసిన కవిత చదివి నేను ఫిదా….
నా కళ్ళు లారీ హెడ్ లైట్లు అన్నావు గా నేనైతే ఇంకా బాగా కనపడాలని ఇందాకే మా పొయ్యి కాడ కూర్చుని ఆ మసి పూసుకున్న ఇప్పుడైతే బలే కనిపిస్తున్నాయి
నా పిలక ను ఎలక తోక తో పోల్చావు కదా చాన ఆనందం అయ్యింది పో…
ఈరోజు పిడకలు కొడుతుంటే నువ్వు నా కళ్ళను పిడకలతో పోల్చావే అదే గుర్తొచ్చి సిగ్గుతో చేతిలోని పేడ పక్కకు విసిరేస అధి మా బామ్మ మీద పడి ఆమె నా మీద పడింది …..కానీ ఏమాటకామాటే బలే పోల్చావు
నా గొంతు బర్రె గొంతు అన్నావ్ గా అందుకే ఈ మాట మా బర్రె కి వినిపించిన అదేందో అప్పటినుంచీ అధి అరవడం మానేసింది మధ్యాహ్నం అయితే బాయిలో దూకబోయింది ఎందుకొ ఎమో…
అదంతా సర్లే గాని ఇదిగో ఈ ఉత్తరం సుబ్బాయమ్మ కొట్టు వైపు వస్తున్న మా పుంజు మెడ కు కట్టిన తీసుకో ఉత్తరం మాత్రమే పుంజు నీ తీసుకుని పోయినావనుకో
సాయంత్రానికి నువ్వూ కూర అయితావు హా…
అన్నట్టు టి కాలి చేయకు వస్తున్న నా వన్ బై టు మిగుల్చు లాస్ట్ లో ఆ టి పడేయకుండా ఉంచు ఆరబెట్టి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకుందాం
ఉండు ఉండు వస్తున్న
– అమూల్య మర్రి