పండితుడు / పామరుడు / వృత్తి
పండితుడైనా పామరుడైనా ఆకలి బాధ తప్పదు
వృత్తి విధ్యలు చేసుకోక తప్పదు..
కానీ పండితుడెప్పుడూ ఆర్థిక బాధలే పడుతున్నాడు
బతక లేక బడి పంతులు అంటారు కదా! అలాగే ఉంది
పరిస్థితి..
పండిత పుత్ర పరమ శుంఠ అని కూడా అంటారు..
నిజమేనేమెా!
ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్లు చేసి చేసి విసుగొచ్చేమెా
ఇంట్లో చేయరిక..
కానీ ఏ వృత్తి వారు ఆ వృత్తి చేస్తేనే దేశం అయినా ఊరైనా బాగుంటాయి..
ఎవరు చేసే వృత్తి వాళ్లు చేయడమే ధర్మం ..
అలా చేస్తేనే ఆ విధ్య చాలా బాగా వస్తుంది ఎందుకంటే
చిన్నప్పటి నుండి చేసినవి చూస్తూ ఉంటారు కదా!
వెన్నతో పెట్టిన విధ్యలాగా వస్తుంది..
ఎవరి వృత్తి వారికి దైవంతో సమానం..
అంతే కదా!
-ఉమాదేవి ఎర్రం