పాము కాదు జడ

 పాము కాదు జడ

రవి వాళ్ళ నాయనమ్మ చనిపోయింది.  అందరూ ఆవిడని చూడడానికి వచ్చి శ్రీధర్ కి ధైర్యం చెపుతున్నారు.చిచ్చుల కాంతమ్మ వచ్చింది. ఆవిడని చూసిన శ్రీధర్ భయంతో ,ఈ కాంతమ్మ ఏంటి ఇక్కడికి వస్తుంది. అసలే ఆవిడ నోరు తెరచి చాలు అందరి బుర్ర తింటుంది అని అనుకున్నాడు.’బయటకు మాత్రం శ్రీధర్ కన్నీళ్లు తుడుచుకుంటునట్టు నటిస్తున్నాడు.

అక్క… ఇంత తొందరగా నువ్వు వెళ్లిపోతావు అని నేను అనుకోలేదు.ఇన్ని రోజులు నీకు నాకు మాటలు లేకపోయిన నేను బాధ పడలేదు” ఏడుస్తుంది కాంతమ్మ.కాంతమ్మ మాటలు విన్నా పక్కనున్న ఆడవాళ్లు “తన అక్కని తానే చంపాలని అనుకుంది , ఎన్నోసార్లు అలాంటిది ఇలా ఏడుస్తుంటే ఈవిడ మాటల్లో నిజం ఎంత?” అని అందులో ఒక ఆవిడ ఉంది.

“చనిపోయిన ఆవిడ కంటే ఇప్పుడు ఏడుస్తున్న ఆవిడకి ఆస్తి మీద ఆశ ఎక్కువ. ఆస్తి కోసమే వచ్చి ఉండొచ్చు” అని మరొక ఆవిడ అన్నది.
చిచ్చుల కాంతమ్మ ఏ లాభం లేకుండా ఏ పని చెయ్యదు. అందుకే కదా ఆవిడకి చిచ్చుల కాంతమ్మ పేరు వచ్చింది అని అనుకుంటున్నారు ఇద్దరు.
వీళ్ళ మాటలు విన్న శ్రీధర్ తనలో తాను నవ్వుకుంటున్నారు.

ఎలాగైనా కాంతమ్మని ఇక్కడి నుండి పంపించాలని సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.రాత్రి అవడం వల్ల అందరూ అలసిపోయి పడుకున్నారు. కాంతమ్మ పక్కన పక్కింటి అమ్మాయి పడుకుంది.ఆ అమ్మాయి జడ పొడవు జడ.  దూరం నుంచి చూస్తే పాములాగా అనిపించింది శ్రీధర్ కి.
మళ్లీ కళ్ళు నులుముకుని చూస్తే అది జడ అని తెలిసింది.

ఒక్కసారిగా శ్రీధర్ “పాము… పాము… పాము” అని అరిచాడు.అందరూ లేచి చూస్తే ,”ఎక్కడ పాము” అని అడిగారు.”కాంతమ్మ పక్కనే ఉంది పాము” అని చెప్పాడు శ్రీధర్.ముందు జాగ్రత్తగా కాంతమ్మ దగ్గరికి ఎవర్ని వెళ్ళనివ్వడం లేదు శ్రీధర్.
కాంతమ్మని ఎవరు మెల్లగా తట్టి లేపారు.

అంతే తన పక్కనున్న నిజమైన పామే అనుకోని భయంతో మెల్లగా లేచి ఊరు చివర వరకు పరుగు అందుకుంది.అంతే అందరూ నవ్వుతూ కారణజన్మురాలు బతికిపోయింది అని అనుకున్నారు.తర్వాత అది పాము కాదు జడ అని తెలిసి అందరూ ఇంకా నవ్వుకున్నారు.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *