పగలే వెన్నెల
పరిణతి చెందిన విలువలకే
వన్నెతెచ్చే అణువుల అనుభూతుల సరిగమలు
వెన్నెల ఉత్సాహాల ఊరట
హృదయానికి చెవులుంటే
మనసుతెలిపేమధురగీతoచల్లనివెన్నలవుతుంది
మదిలోనమమత మెదిలినా
కనుల మబ్బుల్లో జడివాన
ఆనందాల హాయి కాదా
గలగలమనిమాటల లయలు ఒలికినా పరిమళాలవేనీల హారాలు అవే
అందినదాన్ని ఆరాధిస్తే
విరియును వెన్నెలవలే
కలువలై
గుభాళించినఅనుభూతులు
పంచుకుంటే ముంగిట వాలిన పూజాఫలం
కాదా ఈ జగమంతా…..?
– జి జయ