పదవీకాంక్ష
పాత తరం రాజకీయ నాయకులు నిజాయితీగా,
నిబద్ధతతో పనిచేసేవారు.
ప్రజల మనసుల్లో చిరస్థాయిగా
ఉండేవి వారు చేసిన పనులు.
విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవి.
విధానాలపై విమర్శలు ఉండేవి తప్పితే
ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే
వారు కాదు. ఇప్పుడేమో రాజకీయ రంగంలో డబ్బుకి
ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది.
కొందరు రాజకీయ నాయకులు
పదవీకాంక్షతో ఎక్కువ డబ్బు
ఖర్చుపెట్టి అయినా సరే
పదవి పొందాలనే ప్రయత్నం
చేస్తున్నారు. సామాన్య వ్యక్తి
రాజకీయ రంగంలో నిలదొక్కుకోవాలంటే చాలా
కృషి చేయాల్సి వస్తోంది.
ఇప్పటికీ రాజకీయ రంగంలో
మంచి నాయకులు ఉన్నారు
కానీ వారికి ప్రజల నుండి పూర్తి మద్దతు లభించటం లేదు.
మంచివారికి ఓటు వేయాలి
అని ప్రజలు అనుకున్నప్పుడే
సమూలంగా రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది.
అప్పటివరకు మంచి రోజులు
రావాలని కోరుకోవటం తప్ప
సాధారణ పౌరులకు మరొక
మార్గం ఉండదు.
-వెంకట భానుప్రసాద్ చలసాని