పదహారు – నూరు
వెనక్కి చూస్తే పదహారు
ముందుకు చూస్తే నూరు
కళ్ళముందు రంగుల ప్రపంచం
భవిష్యత్తుపై ఎంతో ఆశ
వర్తమానంలో తెలియని ఆవేశం
గమ్యం,ఎన్నో ఊహల దూరం
రక రకాల రంగుల మార్గాలు
ప్రకృతి నేర్పే శారీరక భాషలు
ఏవేవో తెలియని ఊహలు
జీవిత భాగస్వాముల వెతుక్కొనే తపన
తనకాళ్ళ మీద నిలబడే ఆలోచన,
చదువు,సంపాదన,ముందుచూపు
ఆలోచన,ఎన్నో కోర్కెలు ఎందరో మిత్రులు
కట్టు బాట్లు సమాజం ఎన్నెన్నో
కట్టిపడేసే చూపులు, భావాలు
అన్నిటిని అధిగమించి
ప్రపంచమంతా భాగస్వామే అనుకొనే
ఒక మానసిక,శారీరిక,భావావేశాల
కూడలి ఈ పదహారు.
– రమణ బొమ్మకంటి