ఊరట ఏదీ?
ఎవరో నిశ్శబ్దాన్ని మీటినట్టు
మౌనం మూతి బిగించుకుందక్కడ
దూరంగా కదిలే నల్లమబ్బు
ఆలోచనల కేన్వాసుపై అనుభవాలను గీస్తోంది
చెట్టు పుట్ట తమ ఏకాంతాన్ని సంబరం చేసుకుంటున్నాయి
మిణుకుమనే లైట్లు
ఆరిపోతున్న ఆశల్ని వెలిగించాలని తాపత్రయం లో ఉన్నాయి
మౌనం, ఏకాంతం లేని మనిషెంత
దురదృష్టవంతుడు
జనసందోహం చిక్కుముడుల సందేహమై దిగాలుపడుతుంటే
దేహబాధకు మందేసే దృశ్యాన్ని వెతికే మనసుకు ఊరట ఏదీ?
– సి. యస్. రాంబాబు