నివాళి
మాలో ఒకరుగా కలిసిపోయారు
మాకెన్నో విషయాల్లో సాయం చేశారు
మా తప్పొప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇస్తూనే,
మాలో కొంత స్ఫూర్తిని నింపారు
మీ ఆశయాన్ని తెలుపుతూ మాకు వెన్నుదన్నుగా నిలిచారు
విద్యార్థులను తీర్చిదిద్దుతూ వృత్తికి న్యాయం చేశారు.
మేమూ మీ విద్యార్థులమే అంటూ సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా మాకు ఎన్నో కథలు కవితలు పంపుతూ
అండదండగా నిలిచారు. మొదలు పెట్టిన కథ ముగించకుండానే అర్ధాంతరంగా అశువులు బాశారు
విషయం తెలిసినా రాలేక పోయాము కడసారి వీడ్కోలు
కూడా పలక లేక కన్నీరు మున్నీరు అయ్యాము. అయినా
మీరెప్పుడూ మా హృదయాల్లో ఉంటారు. మిమల్ని మేము
చూడకపోయినా, కలిసి మాట్లాడక పోయినా, మీరెంటో మీ
గొప్పతనం ఏమిటో తెలుసు కాబట్టి మిమల్ని మేమెప్పుడూ
మర్చిపోలేము. కవిగా, ఉపాధ్యాయులుగా,
నిరంతర విద్యార్థిగా నేర్చుకోవాలి అనే మీ మాటలు,
రచనలు మిమల్ని ఎప్పుడూ మర్చిపోకుండా చేస్తాయి. మీరు మా మధ్య లేరనే బాధ మాకు లేకుండా మీ రచనల్లో మిమల్ని
మేము ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. మా అక్షరలిపికి మీరందించిన అక్షరమాలలే సుమాలుగా గుచ్చి
అవే అక్షరాలని నీరాజనంగా అర్పిస్తూ మీకివే మా అక్షర భాష్పంజలి అర్పిస్తూ
మీరు ఆ పరమాత్మలో లీనం అయినా మమల్ని చూస్తూ ఉంటారని ఆశిస్తూ మీకిదే మా అక్షర నివాళి 🙏💐💐😔😔
ఇటీవల మన నుండి దూరం అయిన మన అక్షరలిపి రచయిత వాసు గారికి అంకితం..
– భావ్య చారు