నిర్జీవి
బ్రతికినంతసేపు ఆరాటపడుతూ
పోరాటం చేస్తూ డబ్బు కూడా పెడుతూ
ఎదుటివాడు ఏమైపోతే నాకేంటి నా
స్వలాభం నాకు ముఖ్యం.
తల్లి లేదు తండ్రి లేదు
తోడబుట్టిన వాళ్ళు లేరు
నాకు నేనే రాజును
అందరికంటే పై స్థాయిలో ఉండాలి.
అందరూ నాకిందే ఉండాలి.
అనే స్వార్ధబుద్ధి ఈర్ష ద్వేషాలు అసూయ కక్షలు.
ఎదుగుతున్న వాడిని ఓర్వలేక అణగదొక్కేయడం
సర్వం నాకే సమస్తము నేనే
అనుకొనీ స్వార్ధ రాజ్యంలో
స్వలాభార్జన చేసి కోట్ల రూపాయల
నల్లధనం కూడబెట్టి పంచభక్ష
పరమాన్నాలతో భోజనం చేసి
టుంగు టుయ్యాలలో కూర్చొని
టీవీ చూస్తూ..
చూస్తూ అర్ధరాత్రి ప్రాణం విడిచి తెల్లారేసరితల్లా
నిర్జీవిల పడి ఉంటివి.
తెల్లవారి కుటుంబ సభ్యులు చూసి
బంధు జన వర్గం వారంతా
వచ్చి చూసి దహన సంస్కారాలకు
ఏర్పాటు చేసి పుష్పాలు చల్లుతూ..
ఒలుకుల మిట్టకు తీసుకువెళ్లి
చితిమంటల్లో కాలిస్తే బూడిదై పోతివి
ఏడబాయే ధనము దర్పం చివరకు నీతో వచ్చిందేమిటి..?
ఉన్నంతసేపు నలుగురుతో కలిసి మంచిగా బ్రతకండి
ఉన్నంతలో దానధర్మాలు చేయండి పోయేటప్పుడు
తీసుకుపోయేదేమీ లేదు.
-బేతీ మాధవి లత