నీరే ప్రాణం
ప్రాణం నిలుపుకోవాలి
అంటే నీరు తాగాల్సిందే.
నీరు కావాలంటే
వర్షం పడాల్సిందే.
వర్షం పడాలంటే మనం
చెట్లు నాటాల్సిందే.
అన్నీ తెలిసిన మనం
చెట్లను నరికేస్తుంటే
భూమంతా నిప్పుల
కొలిమి కాదా?
భూతాపం పెరిగిపోదా?
ఇది స్వయంకృతాపరాధం
అని మానవుడు గ్రహిస్తే
అనేక చెట్లను నాటుతాడు.
మంచి వర్షం పడుతుంది.
మనిషి ప్రాణం నిలుస్తుంది.
మనుషుల్లారా చెట్లు నాటండి.
పర్యావరణాన్ని కాపాడండి.
-వెంకట భానుప్రసాద్ చలసాని