నిరాశ
నాదనుకున్న నా కల కలలాగా మిగిలిన
నేననుకున్న కల నను వీడిపాయినా
నా కల నాకు దూరమైతే
నా కనులు కంటతడి పెట్టినా
నా మనసుని నిరాశ నిస్పృహలు ఆవహించినా
శూన్యంలోకి తొంగిచూస్తే ఏదో చిగురించిన చిన్న ఆశ
లేచి పరుగులు పెడదామంటే నేను లేవలేను
మనసారా పలకరిద్దామంటే మాట్లాడలేను కారణం
నాదనుకున్న నా కల చెదిరిపోయింది
అది కాల ప్రవాహంలో కలిసిపోయింది
నేనేం చేయను
కన్నీళ్ళ ప్రవాహంలో కాలం గడపడం తప్ప నేనేం చేయగలను
– భరద్వాజ్