నేటి సమాజంలో మహిళల పాత్ర

నేటి సమాజంలో మహిళల పాత్ర

స్త్రీ ఒక శక్తి. ఒక అద్భుతం ఒక సృష్టి రహస్యం. స్త్రీ లేనిది మనుగడ లేదు స్త్రీ లేనిది సృష్టి లేదు స్త్రీ లేనిది ప్రపంచమే లేదు.

స్త్రీ అనేది ఒక మహోన్నత శక్తి. భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనవుతూ వచ్చింది ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగి ఉన్న భారతీయ మహిళలు అనేకమంది సంఘసంస్కర్తలు భారతదేశంలో మహిళల తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి అత్యున్నత పదవులను అలంకరించారు.

ఇలాంటి గొప్ప గొప్ప పదవులను అలంకరించిన మహిళలు ఎన్నో వివక్షలకు లోనవుతున్నరు. అయితే పూర్వ కాలం నుంచి ఇప్పటి వరకు మహిళ రక్షణ లోగానే మహిళల పట్ల చూస్తున్న దృష్టికోణం గానే మారుతూ వచ్చాయి.

ఈ చట్టాల పట్ల మహిళలు తన పట్ల ఎంతో మంది కృషి చేశారు. గురజాడ అప్పారావు గారు, జ్యోతిరావు  ఫూలే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్ మోహన్ రాయ్, లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మహిళల అభ్యున్నతికి పాటు పడ్డారు.

అయితే వీటి కన్నా ముందు ప్రాచీన భారతదేశంలో మహిళలు జీవితపు అన్ని విభాగాలలో పురుషులతో సమాన హోదా అనుభవించారని పరిశోధకులు చెబుతున్నారు.

ఆ తర్వాత మధ్యయుగ కాలంలో సమాజంలో మహిళా స్థాయి ఇంకా దిగజారింది. కొన్ని వర్గాలలో సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటివి జరిగాయి అలాంటి పరిస్థితుల్లో కూడా కొంత మంది మహిళలు రాజకీయ, సాహిత్య, విద్యా రంగాలలో రాణించారు.

ఇక తర్వాతి కాలంలో మహిళలు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. దుర్గాబాయి దేశ్ముఖ్, కస్తూర్భాగాంధీ, అనిబిసెంట్, విజయలక్ష్మి పండిట్ లాంటివారు స్వతంత్ర పోరాటంలో తమ వంతు పాత్రను పోషించారు.

విద్య ఆర్థిక అభివృద్ధి లో భాగంగా మహిళల అక్షరాస్యత రేటు ఇప్పుడు పెరిగినప్పటికీ ఒకప్పుడు ఇంతగా లేదు మహిళలకు చదువు అవసరం లేదు అనేది చాలా బలంగా ఉండేది.

కానీ కొంతమంది ప్రముఖుల వల్ల స్త్రీలు చదువుకో గలిగారు. వయోజన విద్య రాత్రి బడి అనేక విద్యా కార్యక్రమం వంటి వాటిలో వాళ్ల చదువులు నేర్చుకున్నారు.

ఇలా చదువు నేర్చుకున్న మహిళలు భారతదేశంలో చాలా మంది చిన్న చిన్న పనుల్లో భాగస్వామ్యం అయ్యారు. చిన్న చిన్న పల్లెలోనే కాకుండా కొంచెం పెద్ద పట్టణాలలో కూడా వాళ్ళు తమ వంతు పని చేయగలుగుతున్నారు.

మహిళలు ఇంటి పని కాకుండా బయటకు వెళ్లి కూడా సంపాదించవచ్చు అని రుజువు చేశారు. తాము మగవారికన్నా ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు.

ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగాలలో, సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా మహిళలే కనిపిస్తూ ఉంటారు.

మహిళలు ఇంట్లో ఉండి కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని క్యాండిల్స్, పేపర్ ప్లేట్స్ లాంటివి తయారు చేస్తూ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఒక మహిళా శక్తిగా ఎదిగిన సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి.

ఇక మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకుందాం. పూర్వకాలంలోనే కాకుండా ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా మహిళల పట్ల చాలా దారుణమైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.

చిన్న పిల్లల నుండి ముసలి అవ్వ వరకు ఎవరిని వదలడం లేదు. ఒకప్పుడు బాల్యవివాహాలు, కట్నము, శిశు హత్యలు, బలవంత గర్భస్రావాలు లాంటివి చేసి హింసించేవారు.

ఇప్పుడు కూడా వాటికి తక్కువ ఏమీ లేదు. స్త్రీ ఎంత సాధించినా కూడా ఇలాంటి విషయాలలో తను బాధ పడుతూనే ఉంది. హింసను అనుభవిస్తూనే ఉంది.

ఇప్పటికి కూడా ఆడ మగ అనే వ్యత్యాసాలు మనకు ప్రతి రోజు పేపర్లో న్యూస్ లో కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడో ఒక చోట మహిళలు లైంగిక వేధింపులకు అత్యాచారాలకు హత్యలకు గురవుతున్నారు.

ఇంట్లోనే కాకుండా పనిచేసే రంగములో ఎక్కడైనా ఇలాంటి వివక్షకు లైంగిక వేధింపులకు బాధపడుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు ఎంతగా ఉన్నతిని సాధించినా ఈ విషయంలో మాత్రం ఇంకా వివక్షకు లోను అవుతూనే ఉన్నారు.

సినిమా, రాజకీయ, కళా, సాహిత్య, సాంకేతిక రంగాలలో మహిళలు ఎంతో అభివృద్ధి సాధించారు. అయినా వారు పనిచేసే రంగాలలో కాకుండా ఎక్కడ చూసినా కూడా మహిళలు చాలా వివక్షకు గురవుతున్నారు లైంగిక వేధింపులు ప్రతిరోజు అలవాటు గా మారాయి.

ఈ పురుషాధిక్య ప్రపంచంలో మహిళకు ఇలాంటి దారుణాలు జరగడం యధావిధిగా మారింది. ఇలాంటివి జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని చాలామంది పోరాడుతున్నారు కానీ అవి కార్యరూపం దాల్చడం లేదు.

పసిపాప నుంచి ముసలమ్మ వరకు అత్యాచారాలు జరగడం ఈ నవీన యుగంలో తలవంపులు తెస్తోంది. ఏ పాలకులైన ఎంత సొంత రాష్ట్రం సాధించిన వీటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

పాలకుడు ఎవరైనా ఏమైనా చట్టాలు తీసుకొని వస్తే ఆడవారిపై జరిగే అత్యాచారాలు ఆగిపోతాయా, దిశ లాంటి చట్టాలు ఉన్నా కూడా అవి పేరుకు మాత్రం ఉన్నాయి కానీ ఆచరణలో లేవు.

ఎంత మంచి పాలకులు అయినా మహిళల పట్ల ఎలాంటి వివక్ష చూపడం వల్ల మహిళలు పాలకుడు అంటే చిన్న చూపు ఏర్పడడం సహజం. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకు రావడం లేదు.

ఒకవేళ ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొని వస్తే మహిళలు ఎంతో సంతోషిస్తారు అనడంలో సందేహం లేదు.

అలాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాలని మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలకు మానభంగాలకు అడ్డుకట్ట వేయాలని మహిళలు ఇంకా ఉన్నత స్థితి సాధించాలని, ఏ రంగంలో అయినా మహిళలకు హింసలు ఉండకుండా ఉండే రోజు తొందరలోనే రావాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా బలంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *