మహిళ
మహిళా ఓ మహిళా
బ్రహ్మ కైనా అమ్మవి నీవే
అమృతపు వాక్కునీవే
ఆత్మీయత అనురాగం నీవే
అన్నపూర్ణ వి నీవే
ఆదిశక్తి వి నీవే
ఓర్పు నీవే
నేర్పు నీవే
నవరసాల నాట్యము నీవే
పరిమళించే పూవు నీవే
ప్రతి ఇంటా మార్గం నీవే
అవనిలోనూ అంతరిక్షం లోనూ
అరుదైన పాత్ర నీవే
ధీర వనిత వి నీవే
వీర మాతవూ నీవే
వుప్పోంగే కెరటం నీవే
ఉలిక్కి పడే గాథ నీదే
మారుతున్న కాలంలో కావాలి నువ్వొక మహాశక్తి
మహిళా ఓ మహిళా నీ
మనుగడే మానవాళి
అద్భుత శక్తి
అదే నీలో వున్న దివ్యశక్తి
మహిళా ఓ మహిళా
– జి.జయ